Paris Olympics 2024: పక్కా పతకాలు సాధించే భారత అథ్లెట్ల జాబితా ఇదే!
ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 15 రోజుల్లో ఈ వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్‌కు తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్‌ల్లో అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు మొత్తం 16 క్రీడల్లో పోటీ పడనున్నారు. అచంట శరత్, పీవీ సింధులు ఆరంభ వేడుకల్లో భారత బృందానికి ఫ్లాగ్ బెరర్‌గా వ్యవహరించనున్నారు. 1920 నుంచి భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఈ సంఖ్య ఈసారి 111కు పడిపోయింది. క్రీడల సంఖ్య కూడా 18 నుంచి 16కు పడిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో అర్హత సాధించిన భారత ప్లేయర్లు.. ఈ సారి క్వాలిఫై కాలేకపోయారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఇందులో నీరజ్ చోప్రా బంగారు పతకం ఉండగా.. మీరాభాయి చాను, రవికుమార్ దహియా రజత పతకాలు సాధించింది. పీవీ సింధు, లోవ్లీనా బోర్గోహైన్, బజరంగ్ పూనియాలు కాంస్య పతకాలు సాధించారు.
ఈ సారి ఈ సంఖ్యను డబుల్ చేయడంపై భారత అథ్లెట్లు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా 10 మంది అథ్లెట్లు కచ్చితంగా పతకాలు గెలిచే అవకాశం ఉంది.
1.నీరజ్ చోప్రా(జావెలిన్ త్రోయర్)
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నీరజ్ చోప్రా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
2. సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి(బ్యాడ్మింటన్)
భారత పురుషుల డబుల్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టిలు కూడా పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే అవకాశం ఉంది. వరల్డ్ నెంబర్ వన్ డబుల్ జోడీగా కొనసాగుతున్న ఈ భారత ద్వయం.. ఇటీవల అద్భుత విజయాలు సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ జోడీ క్వార్టర్స్‌లో వెనుదిరిగి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ సారి మెడల్ సాధించాలనే కసితో ఉంది.
3.నిఖత్ జరీన్(బాక్సింగ్)...
హైదరాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ సైతం పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ ఫేవర్‌రేట్‌గా బరిలోకి దిగుతోంది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన నిఖత్ జరీన్.. ఈ సారి మెడల్ గెలిచి ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నిఖత్ జరీన్ రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
4.లోవ్లినా బోర్గోహైన్(బాక్సింగ్)
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లోవ్లినా బోర్గోహైన్ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవల ఆమె బరిలోకి దిగిన టోర్నీల్లో మిశ్రమ ఫలితాలు అందుకుంది.
5. ఫురుషుల హాకీ టీమ్..
భారత పురుషుల హాకీ టీమ్ కూడా ఈసారి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవలే హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. పీఆర్ శ్రీజేష్ గోల్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.
6. వినేష్ ఫోగట్(రెజ్లింగ్)
స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ సైతం మెడల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఆమె కొన్ని టోర్నీల్లో పాల్గొంటుంది.
7.సిఫ్ట్ కౌర్ సమ్రా(షూటింగ్)
షూటింగ్‌లో సిఫ్ట్ కౌర్ గోల్డ్ మెడల్ గెలిచే అవకాశం ఉంది. ఏషియన్ గేమ్స్ సిఫ్ట్ గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొషిషన్‌లో కూడా ఆమె పాల్గొననుంది.
8. పీవీ సింధు..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. గత రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం మాత్రమే అందుకుంది. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న సింధు.. స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా రెడీ అవుతోంది.
9. మీరా భాయ్ చాను(వెయిట్ లిఫ్టింగ్)
టోక్యో ఒలింపిక్స్‌లో మీరా భాయ్ చాను సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ సారి బంగారు పతకం గెలవడమే లక్ష్యంగా సిద్దమవుతోంది.
10. అదితి అశోక్(గోల్ఫ్)
గోల్ఫ్ విభాగంలో అదితి మూడో సారి ఒలింపిక్స్ బరిలో దిగుతోంది. గత రెండు ఒలింపిక్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆమె..తాజాగా మెరుగైన ర్యాంక్ సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications