Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత షాట్‌పుట్‌ ప్లేయర్‌పై నిషేధం

Indian shot putter Navin Chikara banned for four years for flunking dope test

న్యూఢిల్లీ: డోపింగ్‌ పరీక్షలో విఫలమైన భారత షాట్‌పుట్‌ ప్లేయర్ నవీన్‌ చికారాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సంఘం (ఐఏఏఎఫ్‌) ఇంటెగ్రిటీ విభాగం నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. 2018 జూలైలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో నవీన్‌ విఫలమైనట్లు ఐఏఏఎఫ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

దీంతో అతనిపై నిషేధం జూలై 27, 2018 నుంచి అమలులోకి వస్తుందంటూ ఐఏఏఎఫ్‌ తన తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. 'నాడా' అతని శాంపిల్స్‌ను సేకరించి కెనడాలోని అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా)కు పంపగా... అక్కడ జరిపిన పరీక్షల్లో నవీన్‌ నిషేధిత ఉత్ప్రేరకం జీహెచ్‌ఆర్‌పీ-6 వాడినట్లు తేలింది. అనంతరం జీహెచ్‌ఆర్‌పీ-6.. నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నట్లు తనకు అవగాహన లేదని నవీన్‌ వివరణ ఇచ్చాడు. 23 ఏళ్ల నవీన్‌ 2018 ఫెడరేషన్‌ కప్‌లో రజత పతకంతో పాటు... అదే ఏడాది జరిగిన అంతర్రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

Story first published: Sunday, March 29, 2020, 10:09 [IST]
Other articles published on Mar 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+