For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోపింగ్‌లో పట్టుబడ్డ భారత మహిళా అథ్లెట్‌.. నాలుగేళ్ల నిషేధం

Indian middle-distance runner Jhuma Khatun banned for four years for failing dope test

న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడటంతో భారత మహిళా మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ జూమా ఖాతూన్‌పై అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం 'డి హైడ్రోక్లోరోమిథైల్‌ టెస్టోస్టిరాన్‌' వాడినట్లు తేలింది. 2018 జూన్‌లో గౌహతి వేదికగా జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో జుమా 1500, 5000 మీటర్ల విభాగాల్లో బ్రాంజ్ మెడల్స్ సాధించింది.

ఈ పోటీల సందర్భంగా ఆమె నుంచి జాతీయ డోపింగ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్‌) శాంపిల్స్‌ సేకరించి పరీక్ష చేయగా నెగెటివ్‌ అని తేలింది. అయితే అదే శాంపిల్‌ను 'వాడా' కెనాడాలోని తమ ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్‌గా రావడం గమనార్హం. జుమాపై నిషేధం ఈ ఏడాది విధించినా... ఈ బ్యాన్ మాత్రం 2018 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా 2018 జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ఆమె పాల్గొన్న ఈవెంట్స్‌లో సాధించిన అన్ని ఫలితాలను రద్దు చేశారు.

అయితే తన శరీరంలోకి నిషేధిత డ్రగ్ ఎలా వచ్చిందో తెలియదన్న ఖాతున్.. 'బి' శాంపిల్ టెస్ట్ చేయాలని కోరింది. 2019 జనవరిలో ఏఐయూకు తన మెడికల్ ఫైల్ సమర్పించిన ఖాతున్ అందులో ఎడ్వైర్స్ ఎనలిటికల్ ఫైండింగ్(ఏఏఫ్) వివరాలను చూపించలేక నిషేధానికి గురైంది.

Story first published: Sunday, April 26, 2020, 9:25 [IST]
Other articles published on Apr 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+