Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Esha Singh: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ షూటర్.. వరల్డ్ రికార్డ్!

భారత షూటర్ ఈషా సింగ్ చరిత్ర సృష్టించింది. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగిన ISSF World Cup 2026లో మహిళల 25 మీటర్ల పిస్టర్ విభాగంలో ఈ హైదరాబాద్ అమ్మాయి అద్భుత ప్రదర్శనతో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది.

ప్రపంచంలోని 85 దేశాల నుంచి 723 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఈషా సింగ్ ఫైనల్లో 43/50 స్కోర్ నమోదు చేసి సరి కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో ఆమె జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒకేసారి వరల్డ్ రికార్డు నెలకొల్పిన షూటర్‌గా అరుదైన ఘనతను అందుకుంది.

తొలి భారత షూటర్‌గా..

ఈ విజయంతో ISSF సీజన్ 2026లో భారతదేశానికి తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా కూడా ఈషా నిలిచింది. ప్రపంచ స్థాయి పోటీల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఆమె కనబరిచిన ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, నైపుణ్యం‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

India Shooter Esha Singh Creates History With a Brilliant 25m Pistol World Record in Munich ISSF World Cup

కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈషా సింగ్ భారత షూటింగ్‌లో అత్యంత ప్రతిభావంతమైన యువ క్రీడాకారిణిగా ఎదిగింది. ఇప్పటికే పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె.. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డుతో భారత షూటింగ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.

ఈ విజయం దేశానికి అంకితం

ఈ విషయంపై ఈషా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. 'వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. దేశం కోసం పోటీ పడటం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ఈ విజయానికి కారణమైన నా కోచ్‌లు, కుటుంబ సభ్యులు, భారత షూటింగ్ సమాఖ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ విజయం భారతదేశానికి అంకితం. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను'అని ఈషా సింగ్ చెప్పుకొచ్చింది.

ఈషా సింగ్ సాధించిన ఈ ప్రపంచ రికార్డు భారత షూటింగ్‌కు మాత్రమే కాకుండా దేశంలోని యువ క్రీడాకారులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

Story first published: Thursday, June 4, 2026, 18:28 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+