Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రజతం బంగారమైందోచ్.!

India’s 2018 Asian Games mixed relay medal upgraded to gold

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం జరిగిన జకర్తా ఏషియన్ గేమ్స్‌లో భారత 4x400 మిక్స్‌డ్‌ రిలే టీమ్ నెగ్గిన రజత పతకం.. బంగారమైంది. ఆ ఈ వెంట్‌లో గోల్డ్ నెగ్గిన బహ్రెయిన్ అథ్లెట్‌పై డోపింగ్ బ్యాన్ పడింది. దీంతో బహ్రెయిన్ డిస్ క్వాలిఫై చేసిన ఆర్గనైజర్స్.. భారత్ జట్టు గెలిచిన సిల్వర్ మెడల్‌ను గోల్డ్‌గా అప్‌గ్రేడ్ చేశారు.

నాడు జరిగిన 4x400 మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్‌ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్‌ టీమ్‌ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్‌ జట్టులో సభ్యురాలైన కెమీ అడికోయా డోపింగ్‌లో పట్టుబడింది. ఆమెపై అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్‌ను డిస్‌క్వాలిఫై చేస్తూ భారత్‌కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్‌ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు.

మరో భారత అథ్లెట్‌ అను రాఘవన్‌ ఖాతాలో కూడా ఇదే తరహాలో కాంస్య పతకం చేరింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను 4వ స్థానంలో నిలిచింది. ఈ రేస్‌‌లో అడికోయో గెలిచిన స్వర్ణాన్ని రద్దు చేయడంతో అనుకు కాంస్య పతకం లభించింది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో మెడల్ సంఖ్య 20కి చేరింది.

Story first published: Friday, July 24, 2020, 9:41 [IST]
Other articles published on Jul 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+