Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. బాటన్‌ను అందుకున్న భారత్!

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగిసాయి. 11 రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో 171 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్(110), కెనడా(62), భారత్(39), స్కాట్లాండ్(39) వరుసగా టాప్-5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్‌ను భారత్ స్వీకరించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషాతో పాటు గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్‌ బాటన్‌ను అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని సూచిస్తూ కామన్వెల్త్ గేమ్స్ పతకాన్ని స్టేడియం మొత్తం తిప్పారు. ఆ జెండాను కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ వైస్ ఛైర్మన్ సుసాన్ జాక్‌సన్, స్కాటిష్ నెట్ బాలర్ ఎమిలే నికోల్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ డొనాల్డ్ రుకారెకు జాక్వెలిన్ మెక్‌లారెన్ అందించారు. వారి చేతుల మీదుగా నీరజ్ చోప్రా, పీటీ ఉషా, హర్ష్ సింఘ్వి స్వీకరించారు. దాంతో 20230 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యాన్ని స్కాట్లాండ్ నుంచి భారత్‌కు అధికారికంగా బదిలీ అయినట్లు అయ్యింది.

India Officially Takes the Baton as Ahmedabad Starts Preparations for Commonwealth Games 2030

ఈ ముగింపు వేడుకల సందర్భంగా భారత్, స్కాట్లాండ్‌కు చెందిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత బాక్సర్ జాస్మైన్ భారత పతకాన్ని తీసుకురాగా.. ఆమె వెంట భారత అథ్లెట్లు వచ్చారు. ద వరల్డ్ వన్ ఫ్యామిలీ స్లోగన్‌తో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా వందేమాతం నినాదంతో స్టేడియం దద్దరిల్లింది. భారత క్రీడా ప్రయాణాన్ని వివరిస్తూ.. గుజరాత్ వారసత్వం, ఆవిష్కరణ, ఆధునిక ఆకాంక్షల సమ్మేళనాన్ని హైలైట్ చేస్తూ అహ్మదాబాద్‌ను పరిచయం చేస్తూ నిర్మించి షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకుంది. ఆఖరి రోజు టోర్నీలో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించింది.

Story first published: Monday, August 3, 2026, 9:32 [IST]
Other articles published on Aug 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+