న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేస్‌బాల్ స్టిక్‌తో యువ రెజ్లర్‌పై దాడి చేసిన సుశీల్ కుమార్.. ఫొటోలు వైరల్!

Images Show Sushil Kumar Attacking Wrestler, Who Died Later

న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్స్ మెడల్ విన్నర్ సుశీల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
యువ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీకి సంబంధించిన ఫొటోలు హిందీ, ఇంగ్లిష్‌ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.

ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్‌ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ సాగర్‌ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్‌ కుమార్‌లపై సుశీల్‌ కుమార్, అతని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. అందులో సుశీల్ కుమార్ బేస్‌బాల్ బ్యాట్‌తో రాణాపై దాడి చేశాడు. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత మొబైల్‌లో వీడియో కూడా తీయించాడు. దానిని రెజ్లింగ్‌ వర్గాలకు పంపించాలనుకున్నాడు. కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్ రాణా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోవడంతో సుశీల్ పరారయ్యాడు.

తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రాణా స్నేహితులు సోనూ, అమిత్‌ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు. సుశీల్ అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి మొబైల్స్‌ను పరిశీలించగా దాడికి సంబంధించిన వీడియో బయటపడింది. ఈ హత్య కేసులో సుశీల్‌ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి ఈ వీడియోనే కారణమైంది.

పరారైన సుశీల్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణను వేగవంతం చేశారు. ఇక సుశీల్.. ముందుస్తు బెయిల్‌ తిరస్కరణ.. కోర్టు రిమాండ్‌.. దర్యాప్తునకు సహకరించకపోవడం వంటి విషయాలు తెలిసినవే. ఈ కేసులో సుశీల్‌ను కావాలనే ఇరికించారని, అతనిపై కుట్ర జరపారని గురువారం అతని లాయర్ బీఎస్‌ జాఖర్ సందేహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, సుశీల్‌ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా? అని డిమాండ్ చేశాడు. ఇంతలోనే ఈ వీడియో మీడియాలో హల్‌చల్ అయింది.

Story first published: Friday, May 28, 2021, 12:59 [IST]
Other articles published on May 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X