Esha Singh: స్వర్ణం గెలిచిన హైదరాబాద్ షూటర్.. ఒలింపిక్ మెడలిస్ట్‌కు షాక్!
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ సత్తా చాటింది. భారత ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్‌ను వెనక్కి నెట్టి మరి స్వర్ణ పతకం సాధించింది. చైనాలోని హ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ గోల్డ్ మెడల్ సాధించగా.. మనుభాకర్ బ్రాంజ్ మెడల్ గెలుపొందింది.
సోమవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకుంది. షూట్ ఆఫ్ దాటుకొని వచ్చిన మనుభాకర్ 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈ ఇద్దరు భారత షూటర్లు సత్తా చాటారు. మను బాకర్ 586-20x స్కోర్‌తో క్వాలిఫయింగ్ ఛార్ట్‌లో అగ్రస్థానంలో నిలవగా.. ఈసా సింగ్ 585-18x స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఫైనల్లో మాత్రం 21 ఏళ్ల ఇషా దుమ్మురేపింది.

జూన్‌లో జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగిన ISSF World Cup 2026లో మహిళల 25 మీటర్ల పిస్టర్ విభాగంలో ఈ హైదరాబాద్ అమ్మాయి గోల్డ్ మెడల్‌తో సత్తా చాటింది. ఈ విజయంతో ISSF సీజన్ 2026లో భారతదేశానికి తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా కూడా ఈషా నిలిచింది. ప్రపంచ స్థాయి పోటీల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఆమె కనబరిచిన ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, నైపుణ్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈషా సింగ్ భారత షూటింగ్‌లో అత్యంత ప్రతిభావంతమైన యువ క్రీడాకారిణిగా ఎదిగింది. ఇప్పటికే పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె.. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డుతో భారత షూటింగ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

