Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sajan Prakash: గాయాన్ని జయించి తొలి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించిన కేరళ పోలీస్!

How Indian swimmer Sajan Prakash Overcame Career-threatening Injury to Make Tokyo Olympics
Tokyo Olympics : Sajan Prakash, From Kerala Police To Olympics | Oneindia Telugu

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు 'ఏ'అర్హత ప్రమాణం అందుకున్న భారత తొలి స్విమ్మర్‌గా కేరళ పోలీస్ అధికారి సాజన్ ప్రకాశ్ చరిత్ర సృష్టించారు. రోమ్‌ వేదికగా జరిగిన సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు.

దాంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. కానీ దాదాపు రెండేళ్ల కిందటి ప్రకాశ్‌ పరిస్థితి తెలిస్తే అతను ఇంత దాకా రావడం నమ్మశక్యంగా అనిపించదు. మెడలో డిస్క్‌ జారడంతో ఒక్క స్ట్రోక్‌ కూడా కొట్టలేకపోయిన ఈ 27 ఏళ్ల కేరళ స్విమ్మర్‌.. 'ఎ' ప్రమాణంతో టోక్యోకు అర్హత సాధించగలనని ఊహించే సాహసం కూడా చేయలేకపోయాడు.

అక్కడే మలుపు తిరిగింది..

అక్కడే మలుపు తిరిగింది..

ప్రకాశ్‌ దశ తిరగడం గతేడాదే మొదలైంది. లాక్‌డౌన్‌ కారణంగా థాయ్‌లాండ్‌లో ఇరుక్కుపోయిన అతను అప్పటికి పూల్‌కు దూరమై ఏడెనిమిది నెలలైంది. శారీరక గాయానికి తోడు అతను మానసికంగా కూడా బలహీనుడయ్యాడు. ఆ సమయం (ఆగస్టు 2020)లో అతను కోచ్‌ ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందేందుకు దుబాయ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతన్ని భారత స్విమ్మింగ్‌లో కొత్త అధ్యాయం లిఖించడానికి కారణమైంది.

లాక్‌డౌన్‌తో..

లాక్‌డౌన్‌తో..

తన గాయం గురించి తాజాగా సాజన్ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడాడు. '2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సందర్భంగా మెడ నొప్పి మొదలైంది. అదే తగ్గిపోతుందిలే అనుకున్నా. పెయిన్ కిల్లర్స్ తీసుకుని పోటీల్లో పాల్గొన్నా. ఆ తర్వాత చాలా టోర్నీల్లో పోటీపడ్డా. కానీ నేపాల్‌లో దక్షిణాసియా క్రీడల సందర్భంగా నొప్పి తీవ్రమైంది.

నా ఈవెంట్‌ రోజు నా చేతులు పైకెత్తలేకపోయా. దాంతో స్కానింగ్‌ చేయించుకున్నా. నా మెడలో డిస్క్‌ జారిందని తేలింది. నా ఎడమచేతి దిశలో నొప్పికి అది కారణమైంది. మార్చి (2020) వరకు.. నాలుగు నెలల పాటు విరామం తీసుకున్నా. కోలుకునే దిశగా సాగా. ఆగస్టులో దుబాయ్‌కి వెళ్లా. అక్కడ నా ఫిజియో రిచర్డ్‌ సహకారం అందించడం మొదలెట్టాడు. త్వరగానే పురోగతి కనిపించింది. నా కోచ్, ఆయన భార్య కూడా నాకెంతో సహాయం చేశారు.

ఒత్తిడితోనే గాయమైంది..

ఒత్తిడితోనే గాయమైంది..

'దుబాయ్‌లో తొలి మూడు నెలలు ఒక్క బటర్‌ఫ్లై స్ట్రోక్‌ కూడా కొట్టలేదు. అప్పుడు నాకంత ఆత్మవిశ్వాసం లేదు. పూల్‌లోకి దూకిన ప్రతిసారీ నొప్పిగా అనిపించేది. ఫ్రీస్టైల్‌ స్విమ్మింగ్‌ మాత్రమే చేశా. కొన్నిసార్లు బ్యాక్‌స్ట్రోక్‌ కొట్టా. నెమ్మదిగా తీవ్రత పెంచా. శారీరకంగా, మానసికంగా బలవంతుడిగా మారడమే నా ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నా.

దుబాయ్‌లో స్విమ్మింగ్‌ మొదలెట్టినప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ అర్హతపై సగం సగం ఆశలతో ఉన్నా. గాయాని కంటే ముందు అంతిమ ఫలితం గురించి, టైమ్‌ గురించి ఆలోచిస్తూ చాలా ఒత్తిడికి గురయ్యేవాణ్ని. దాంతో.. నైపుణ్యంపై దృష్టిపెట్టాలన్న ప్రాథమిక అంశాన్ని మరిచిపోయా. మానసిక ఆందోళన, ఒత్తిడి నా గాయానికి కారణమయ్యాయి.

ఒలింపిక్స్ బరిలో రెండోసారి..

ఒలింపిక్స్ బరిలో రెండోసారి..

'నా మొదటి ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ కోసం లాత్వియా వెళ్లా. అప్పటికి నేను బటర్‌ఫ్లైలో పెద్దగా సాధన చేయలేదు. కానీ 2 నిమిషాల్లోనే ఈదడంతో ఏదో మంచి జరుగుతోందని నాకు, నా కోచ్‌కు అనిపించింది. ఆ ప్రదర్శన ఇచ్చిన విశ్వాసంతో ముందుకెళ్లాం'' అని ప్రకాశ్‌ తెలిపాడు. అక్కడి నుంచి వేగంగా మెరుగుపడ్డ అతను.. గతవారం ఒలింపిక్‌ 'ఎ' ప్రమాణం సాధించాడు. కాగా, ఒలింపిక్స్‌లో ప్రకాశ్‌ పాల్గొననుండటం ఇది వరుసగా రెండోసారి. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు. ప్రకాశ్‌ నేరుగా అర్హత పొందడంతో మరో స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌కు అవకాశం లేకుండా పోయింది.

Story first published: Wednesday, June 30, 2021, 12:03 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+