For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుకేశ్ విజయం వెనుక టీమిండియా మాజీ కోచ్!

వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్‌ పేరు మారుమోగుతోంది. ఎవర్నీ కదిలించినా..గుకేశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్లో 18 ఏళ్ల గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. తద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన అతి పిన్నవయస్కుడిగా దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

అయితే గుకేశ్ విజయంలో టీమిండియా మాజీ కోచ్ ప్యాడీ ఆప్టన్ కీలక పాత్ర పోషించారు. మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ప్యాడీ ఆప్టన్‌కు మంచి గుర్తింపు ఉంది. చెస్ అంటేనే మైండ్ గేమ్.. అలాంటి ఆటలో గుకేశ్ ఏకాగ్రత దెబ్బతినకుండా ప్యాడీ ఆప్టన్ అతనికి అండగా నిలిచాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గుకేశ్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతను ఆ ట్రాప్‌లో పడలేదు. ప్యాడీ క్యాప్టన్ శిక్షణతో గుకేశ్ మానసిక బలాన్ని పెంచుకున్నాడు.

How Former India Coach Paddy Upton Helped Gukesh Dommaraju Become World Chess Champion

2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్యాడీ ఆప్టన్ మెంట్ స్ట్రెంగ్త్ కండీషన్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కూడా సుదీర్ఘ కాలం టీమిండియాకు పని చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన భారత హాకీ టీమ్‌కు కూడా ప్యాడీ ఆప్టన్.. మానసిక కోచ్‌గా సేవలందించారు. భారత్ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ప్యాడీ ఆప్టన్ భాగంగా ఉండటంతో అతనిని నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇక వరల్డ్ క్లాస్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగానూ గుకేశ్ నిలిచాడు. అతని కంటే ముందు భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన 14వ రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్.. డింగ్ లిరెన్‌‌పై పైచేయి సాధించి గెలిచాడు.

How Former India Coach Paddy Upton Helped Gukesh Dommaraju Become World Chess Champion

ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ గెలిచాడు. రన్నరప్‌గా నిలిచిన 32 ఏళ్ల లిరెన్‌ రూ.9.75 కోట్లు అందుకున్నాడు. ఇక మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు లభిస్తాయి. ఈ క్రమంలో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్‌కు రూ.5.07 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మిగిలిన నగదు బహుమతిని సమానంగా పంచారు.

Story first published: Friday, December 13, 2024, 13:19 [IST]
Other articles published on Dec 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+