Gukesh Dommaraju:‘శభాష్ గుకేశ్’.. సంకల్పంతో ప్రపంచాన్ని గెలిచావ్! (వీడియో)
వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు నెటిజన్లు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. గుకేశ్ గెలుపును అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టడంతో పాటు స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు.
10 ఏళ్ల వయసులోనే..
అయితే దొమ్మరాజు గుకేశ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గుకేశ్ తనకు 10 ఏళ్లు ఉన్నప్పుడే వరల్డ్ చెస్ ఛాంపియన్ అవుతానని సవాల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గుకేశ్ యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

ఈ వీడియోను షేర్ చేస్తూ 'శభాష్ గుకేశ్'అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దానిని చేరుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడితే విజయం మనదేనని గుకేశ్ నిరూపించాడని పేర్కొంటున్నారు.
అతి పిన్నవయస్కుడిగా..
సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్లో 18 ఏళ్ల గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. తద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన అతి పిన్నవయస్కుడిగా దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
18 ఏళ్ల 08 నెలల 14 రోజుల వయసులో గుకేశ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో కాస్పరోవ్ రికార్డ్‌ను అతను అధిగమించాడు. 1985లో కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. గత 39 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉండగా.. గుకేశ్ బద్దలు కొట్టాడు.

ఇక వరల్డ్ క్లాస్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగానూ గుకేశ్ నిలిచాడు. అతని కంటే ముందు భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన 14వ రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్.. డింగ్ లిరెన్‌పై పైచేయి సాధించి గెలిచాడు.
రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీ
ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ గెలిచాడు. రన్నరప్‌గా నిలిచిన 32 ఏళ్ల లిరెన్ రూ.9.75 కోట్లు అందుకున్నాడు. ఇక మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు లభిస్తాయి. ఈ క్రమంలో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్‌కు రూ.5.07 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మిగిలిన నగదు బహుమతిని సమానంగా పంచారు.
This is @DGukesh talking to @sagarchess1 of @ChessbaseIndia seven years ago.
— Amit Varma (@amitvarma) December 12, 2024
What a moment, that. What a moment, this. pic.twitter.com/vhj9CEcKN5
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications