నేడే కామన్వెల్త్ గేమ్స్ షురూ.. క్రికెట్ ఎందుకు లేదంటే..?
కామన్వెల్త్ గేమ్స్‌కు రంగం సిద్దమైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా గురువారం(జూలై 23) ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆగస్ట్ 2వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు జరగనుండగా.. కామన్‌వెల్త్ దేశాల అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
గ్లాస్గో ఇంటర్నేషనల్ ఎరీనా, స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్, స్కాట్స్‌టౌన్ స్టేడియం, టోల్ క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్‌లు వేదికగా ఈ క్రీడాపోటీలు జరగుతాయి. ఇక ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆయా దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్‌లు ఉంటాయి. దీంతో కామన్‌వెల్త్ గేమ్స్ 2026 అధికారికంగా ప్రారంభం అవుతాయి.

బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ భాగంగా ఉండగా.. భారత జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి సిల్వర్ మెడల్ గెలిచింది. అయితే ఈ సారి క్రికెట్‌ను తొలగించారు. టోర్నీ నిర్వాహణ ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పాటు క్రికెట్, బ్యాడ్మింటన్‌తో పాలు పలు క్రీడలను తొలగించారు.
క్రీడల సంఖ్యను ఎందుకు తగ్గించారంటే..?
వాస్తవానికి కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎడిషన్‌కు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ నిర్వాహణ ఖర్చు 6-7 బిలియన్ ఆస్ట్రేలియాన్ డాలర్లకు పెరిగిపోయిందని పేర్కొంటూ విక్టోరియా ప్రభుత్వం 2023లోనే ఆతిథ్య హక్కులను వదులుకుంది.
దాంతో కామన్వెల్త్ గేమ్స్ భవిష్యత్తు ప్రమాదంలో పడగా.. ఆతిథ్యం ఇచ్చేందుకు స్కాట్లాండ్ ముందుకొచ్చింది. దాంతో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్, స్థానిక ఆర్గనైజర్స్ ఖర్చులను తగ్గించి టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో టోర్నీలోని క్రీడల సంఖ్యను 19 నుంచి 10కి తగ్గించారు. దాంతో క్రికెట్‌తో పాటు హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, రగ్బీ సెవెన్స్ క్రీడలను తొలగించారు. తద్వారా టోర్నీ నిర్వాహణ ఖర్చు గణనీయంగా తగ్గనుంది. క్రీడల సంఖ్యను తగ్గించడంతో భారత్ పతకాల సంఖ్యపై తీవ్ర ప్రభావం పడనుంది.
కామన్వెల్త్ గేమ్స్‌ను ఎలా చూడాలంటే..?
2026 కామన్‌వెల్త్ గేమ్స్ భారతీయులు సోనీ స్పోర్ట్స్ టెన్ 2,సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హిందీ,సోనీ స్పోర్ట్స్ టెన్ 4లో వీక్షించొచ్చు. ఈ ఛానెల్స్‌లో గేమ్స్‌ను ప్రత్యక్షంగా చూడొచ్చు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లైవ్‌లో ఈ గేమ్స్ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ కామన్‌వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్,బాక్సింగ్‌తో పాటు ఇతరత్రా క్రీడలున్నాయి.
ముగింపు సెరెమొనీతో ఈ క్రీడలు అధికారికంగా ముగుస్తాయి. ఆ సమయంలో 2030 కామన్‌వెల్త్ గేమ్స్ భారత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతాయని చెప్పేందుకు అధికారికంగా కామన్‌వెల్త్ గేమ్స్ జెండాను భారత్‌కు అప్పజెప్తారు. 2030లో జరిగే అహ్మదాబాద్ కామన్‌వెల్త్ గేమ్స్ 100వ కామన్‌వెల్త్ గేమ్స్ కావడంతో మరింత గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

