అందం ఆట అయితే వీరిలాగే ఉంటుందేమో. ఆటతో పాటు తమ అందంతో ఈ మహిళా క్రీడాకారులు కుర్రాళ్ల మనసును దోచేస్తున్నారు. ఆట కంటే వారి అందాన్ని చూసేందుకే ఆ ఆటగత్తెలను అనుసరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
అందం అనేది వ్యక్తిగత అభిరుచిని బట్టి మారుతుంది. అసలు ఆటకూ అందానికీ సంబంధం లేదు. కానీ ఆటతో పాటు అందం మీద ప్రేకక్షకుల కళ్లు కేంద్రీకృతం కావడం కూడా సహజమే. కుర్రాళ్ల మనసు దోచేస్తున్న ప్రపంచంలోకెల్లా టాప్-5 ఆటగత్తెలపై ఓ లుక్కెద్దాం.
జర్మనీకి చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అలికా స్మిత్‌ను అత్యంత సెక్సీయస్ట్ అథ్లెట్ అని పిలుస్తారు. అలికా స్మిత్‌కు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమె పరుగుపందెంతో పాటు మోడల్‌గా కూడా సత్తా చాటుతుంది.
యురోపియన్ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్‌షిప్ 2017 టోర్నీలో 4x400 మీటర్ల రిలేలో అలికా స్మిత్ సిల్వర్ మెడల్ సాధించింది. U23 ఛాంపియన్‌షిప్ 2019లో బ్రాంజ్ మెడల్ సాధించింది. జర్మనీ రిలే జట్టు తరఫున 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.

అమెరికా మాజీ ప్రొఫెషనల్ గోల్ఫర్ అయిన పేజ్ స్పిరనాక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గోల్ఫ్ ఆటను యువతకు చేరువ చేయడంలో పేజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 2022లో మాక్సిమ్ అనే పత్రిక ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా క్రీడాకారిణిగా ఆమెను ప్రకటించింది.
2016లో కాక్టస్ టూర్‌లో భాగంగా లాస్ కోలినాస్ క్లబ్‌లో తన మొదటి ప్రొఫెషనల్ విజయాన్ని నమోదు చేసింది.
కాలేజీ స్థాయిలో శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ తరపున ఆడుతూ 'ఆల్-మౌంటైన్ వెస్ట్ కాన్ఫరెన్స్' గౌరవాన్ని అందుకుంది.
ఇరాక్ ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ డోరీన్ రోమెల్ షామౌను వాలీబాల్ క్రష్‌గా పిలుస్తుంటారు. ఇరాక్ మహిళా జాతీయ వాలీబాల్ టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో డోరీన్ కీలక పాత్ర పోషించారు. వాలీబాల్‌తో పాటు, బాస్కెట్‌బాల్ కూడా ఆడుతారు. 15 ఏళ్ల వయస్సు నుంచి ఇరాక్ జాతీయ బాస్కెట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన ఆటతీరుతో పాటు ఆకర్షణీయమైన రూపంతో డోరీన్ రోమెల్ షామౌ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
మహిళల ఫుట్‌బాల్‌లో అమెరికాకు చెందిన అలెక్స్ మోర్గాన్ స్టార్ ప్లేయర్. తన అద్భుతమైన ఆటతీరుతో పాటు ఆకర్షణీయమైన రూపంతో అలెక్స్ ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 2015, 2019లో ఫిఫా మహిళల ప్రపంచ కప్ గెలిచిన అమెరికా జట్టులో అలెక్స్ కీలక సభ్యురాలు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికాకు బంగారు పతకాన్ని అందించడంలో ముఖ్యపాత్ర పోషించింది.
భారత మహిళల క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు.తన క్లాసింగ్ బ్యాటింగ్ స్ట్రైల్, చిరునవ్వుతో నేషనల్ క్రష్‌గా ఆమెకు గుర్తింపు దక్కింది. క్రికెట్‌లోనే అందమైన ప్లేయర్‌గా ఆమె అభిమానుల మనసులను దోచేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి చరిత్రకెక్కింది.