చరిత్ర సృష్టించిన భారత సెయిలర్లు.. ఒలింపిక్స్‌కు మరో ముగ్గురు అర్హత

న్యూఢిల్లీ: భారత సెయిలింగ్ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు భారత సెయిలర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇండియన్ ఒలింపిక్ చరిత్రలో నలుగరు సెయిలర్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో గురువారం విష్ణు శరవణన్ (లేజర్ స్టాండర్డ్ క్లాస్), గణపతి చెంగప్ప- వరుణ్ ఠక్కర్ (49ఇఆర్ క్లాస్)లు సత్తాచాటి టోక్యో బెర్తులు సొంతం చేసుకున్నారు.
బుధవారం నేత్ర కుమనన్ (లేజర్ రేడియల్) ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ సెయిలింగ్‌లో మూడు ఈవెంట్లలో భారత్ బరిలో దిగుతుండటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 9 మంది పాల్గొనగా.. కేవలం ఒకేఒక్క ఈవెంట్లో బరిలో దిగారు. నాలుగు సార్లు ఇద్దరేసి క్రీడాకారులు పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications