Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Formula E race in Hyderabad:ట్రాక్‌పైకి జనాలు, వాహనాలు.. ప్రాక్టీస్‌లో ప్రమాదం!

Formula E race in Hyderabad: Race leader crashes in Free Practice 1

హైదరాబాద్: భారత్‌లో రేసింగ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మన హైదరాబాద్ మరో చారిత్రాత్మక ఈవెంట్‌కు సిద్దమైంది. ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈరేస్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత తొలి నగరంగా హైదరాబాద్ చరిత్రకెక్కనుంది. ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్ తొమ్మిదో సీజన్‌లోని నాలుగో రౌండ్ రేస్ హుస్సేన్ సాగర్ సమీపంలోని ఏర్పాటు చేసిన హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్‌పై శనివారం జరగనుంది.

జెన్3 ఎలక్ట్రిక్ కార్లు గంటకు 200 నుంచి 322 కిలోమీటర్ల స్పీడ్ వరకూ దూసుకెళ్లనున్నాయి. ఈ రేసులో 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు పోటీ పడుతారు. ఇందులో భారత్‌కు చెందిన మహీంద్ర రేసింగ్ టీమ్ కూడా ఉంది.

2.8 కిలోమీటర్ల ట్రాక్‌..

హుస్సేన్‌ సాగర్‌ తీరాన సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ పార్క్‌, ఐమ్యాక్స్‌ మీదుగా 2.835 కిలోమీటర్ల పొడవైన సర్క్యూట్‌ను రూపొందించారు. ఈ మార్గంలో 18 మలుపులు ఉండగా.. రెండు, మూడు క్లిష్టమైన మలుపులు డ్రైవర్ల నైపుణ్యానికి పరీక్ష పెట్టనున్నాయి. 20,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో అన్ని హంగులతో హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ను సిద్ధం చేశారు.

అయితే తొలి రోజు గందరగోళంగా ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం షేక్‌డౌన్‌ తర్వాత మొదటి ఫ్రీ ప్రాక్టీస్‌ రేసు జరగాలి. మధ్యాహ్నం షేక్‌డౌన్‌లో డ్రైవర్లంతా తమ కార్లను పరిశీలించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఫ్రీ ప్రాక్టీసుకు సన్నద్ధమవుతున్నారు. అయితే భద్రత లోపం కారణంగా వాహనదారులు ట్రాక్‌పైకి వచ్చేశారు.

‘ప్రాక్టీస్‌'లో ప్రమాదం

‘ప్రాక్టీస్‌'లో ప్రమాదం

ఎన్టీఆర్‌ మార్గ్‌, ఐమ్యాక్స్‌ వైపుల నుంచి గమ్య స్థానాలకు వెళ్తున్నారు. రేసు నిర్వాహకులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ట్రాఫిక్‌ను నియంత్రించారు. ట్రాక్‌పై నుంచి వాహనాలను తప్పించారు. దీంతో 4.30 గంటలకు ప్రారంభంకావాల్సిన ఫ్రీ ప్రాక్టీస్‌ 45 నిమిషాలు ఆలస్యంగా 5.15 గంటలకు మొదలైంది.

ప్రాక్టీస్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే అపశ్రుతి చోటుచేసుకుంది. 18వ మలుపు (చివరిది) వద్ద పోర్షే డ్రైవర్‌ పాస్కల్‌ వెర్లీన్‌ ట్రాక్‌ పక్కనున్న రక్షణ గోడను ఢీకొట్టాడు. కారు తీవ్రంగా దెబ్బతింది. ట్రాక్‌పై దుమ్ము ఉండటం, పాస్కల్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగింది.

పాస్కల్‌కు గాయాలేమీ కాకపోవడంతో అతను కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం ట్రాక్‌పై నుంచి కారును తొలగించి.. ప్రాక్టీస్‌ రేసును ముగించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాస్కల్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

షాంపేన్‌ పొంగులుండవు..

రేస్‌ విజేతలు పోడియంపై షాంపేన్‌ పొంగులు చిందిస్తూ సంబరాలు చేసుకోవడం కార్‌ రేసింగ్‌లలో ఆనవాయితీ. కానీ స్థానిక సంప్రదా యాల రీత్యా ఈసారి అలా చేసేందుకు వీలులేదని నిర్వాహకులు స్పష్టం జేసినట్టు సమాచారం. బదులుగా ..పుట్టినరోజు వేడుకల్లో ఉపయోగించే 'కన్ఫెటీ కెనాన్స్‌'తో సంబరాలు చేసుకోవచ్చు.

తళుక్కుమన్న తారలు

ప్రాక్టీస్‌ సెషన్‌ను తిలకించేందుకు పలువురు స్టార్లు తరలి వచ్చారు. బ్యాడ్మింటన్‌ ఏస్‌ పీవీ సింధు, నారా బ్రాహ్మణి, నమ్రతా శిరోద్కర్‌, మరోవైపు ప్రాక్టీస్‌ రేసును వీక్షించేందుకు సెలెబ్రిటీలు వరుస కట్టారు. భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు, నారా బ్రాహ్మణి, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరద్కోర్, జూ.ఎన్టీఆర్‌ భార్య ప్రణతి తమ పిల్లలతో హాజరై సందడి చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ప్రాక్టీస్‌ రేసును తిలకించారు.

శనివారం ఉదయం 8.05- 8.55 గంటల వరకు: ఫ్రీ ప్రాక్టీస్‌ 2

ఉదయం 10.40- 11.55 గంటల వరకు: క్వాలిఫయింగ్‌

మధ్యాహ్నం 3.03- 4.30 వరకు: ప్రధాన రేసు

Story first published: Saturday, February 11, 2023, 8:29 [IST]
Other articles published on Feb 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+