
సరదాగా తన కుమారుడితో ఈతకెళ్లిన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ షాడ్ గ్యాస్‌పార్డ్(39) ప్రమాదవశాత్తు మరణించాడు. నాలుగు రోజుల క్రితం(మే17) కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్‌కు తన పదేళ్ల కుమారుడు ఆర్యతో కలిసి ఈతకు వెళ్లిన గ్యాస్ పార్డ్ సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోయాడు.
ప్రమాదంలో ఉన్న అతని కుమారున్ని అక్కడి లైఫ్ గార్డ్స్ కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ గ్యాస్‌పార్డ్‌ను కాపాడలేకపోయారు. సముద్ర తీరం నుండి 50 గజాల దూరంలో గ్యాస్‌పార్డ్ ఉండటంతో ఏం చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇక గ్యాస్‌పార్డ్ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. సముద్రలో కొట్టుకుపోయే ముందు గ్యాస్ పార్డ్ అక్కడి లైఫ్ గార్డ్‌లను తన కుమారుడి రక్షించమని కోరినట్లు పేర్కొంది. రెండు రోజుల తర్వాత గ్యాస్‌పార్డ్ మృతదేహం లభ్యమైందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
డబ్లూడబ్ల్యూఈలో జేటీజీతో కలిసి షాడ్ గ్యాస్ పార్డ్ ప్రాచూర్యం పొందాడు. ఈ ఇద్దరు 2008లో జాన్ సెనా- జేబీఎల్‌తో పోటీపడ్డాడు. 2009 సమ్మర్ స్లామ్ 2009 టీమ్ టైటిల్స్‌లో కూడా తలపడ్డారు. ఇక గ్యాస్ పార్డ్ అకాల మరణంపై జేటీజీ తన బాధను వ్యక్తం చేశాడు. గ్యాస్‌పార్డ్ చివరిసారిగా తనకు చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్‌ను జేటీజీ ట్వీట్ చేసి తన సంతాపాన్ని ప్రకటించాడు.