పారిస్ ఒలింపిక్స్ 2024లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్‌స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలతో సత్తా చాటాడు. అమెరికా తరఫున బరిలోకి దిగిన అతను 400 మీటర్ల హర్డిల్స్‌లో ఒక స్వర్ణం.. 4X400 మీటర్ల రిలేలో మరో బంగారు పతకాన్ని సాధించాడు. దాంతో క్రికెట్ వర్గాల్లో రాయ్ బెంజమిన్ పేరు మారుమోగుతోంది.
సినిమా హీరో కొడుకు సినీ హీరో అయినట్లు.. క్రికెటర్ కొడుకు క్రికెటర్‌గా కాకుండా అథ్లెట్‌గా మారి స్వర్ణాలు సాధించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

400 మీటర్ల హర్డిల్స్‌ను 46:46 సెకన్లలో పూర్తి చేసిన బెంజమిన్.. 4X400 మీటర్ల రిలేను 2:54.43 నిమిషాల్లో ముగించాడు. రాయ్ బెంజమిన్ తండ్రి విన్‌స్టన్ బెంజమిన్ వెస్టిండీస్ తరఫున 21 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం విన్‌స్టన్ బెంజమిన్.. న్యూయార్క్‌లో స్థిర పడ్డాడు. 1997లో అక్కడే పుట్టిన రాయ్ బెంజమిన్..తండ్రిలా ఫాస్ట్ బౌలర్ అయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ రన్నింగ్‌లో అతని ప్రతిభను గుర్తించిన అంటగ్వా కోచ్‌లు రాయ్ బెంజమిన్‌ను ట్రాక్ అండ్ ఫీల్డ్ వైపు మళ్లించారు.