Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తల్లి, భార్య గొంతుకోసి.. అతికిరాతకంగా చంపిన భారత మాజీ అథ్లెట్!!

Former India shot putter Iqbal Singh Boparai kills mother and wife in US

పెన్సిల్వేనియా (అమెరికా): భారత మాజీ అథ్లెట్ ఇక్బాల్ సింగ్ బొపరాయ్ (63) అరెస్ట్ అయ్యారు. అమెరికా పెన్సిల్వేనియాలోని న్యూ‌టౌన్ స్వ్కేర్‌లో కుటుంబంతో ఉంటున్న ఇక్బాల్ సింగ్.. తన భార్య, తల్లిని గొంతుకోసి అతికిరాతకంగా చంపినట్లు నేరం ఒప్పుకోవడంతో అతనిపై హత్య కేసు నమోదైందని అక్కడి మీడియా పేర్కొంది. అయితే ఇద్దరిని హత్య చేసిన తర్వాత ఇక్బాల్ సింగ్ స్వయంగా పోలీసులు సమాచారం అందించారట.

తల్లి, భార్య గొంతుకోసి:

తల్లి, భార్య గొంతుకోసి:

63 ఏళ్ల ఇక్బాల్ సింగ్ తన భార్య, తల్లిని కిరాతకంగా ఆదివారం హత్య చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయమే హత్యల గురించి సింగ్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. న్యూ‌టౌన్ స్వ్కేర్‌‌లోని తన ఇంట్లో తల్లి, భార్య గొంతుకోసిన అనంతరం ఇక్బాల్ సింగ్ స్వయంగా తమకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు వెళ్లేసరికి మృతదేహాలు రక్తం మడుగులో ఉన్నాయట. మరోవైపు సింగ్‌కు కూడా గాయాలతో బాధపడుతున్నారని పోలీసులు చెప్పారు. అయితే ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

 పోలీసుల అదుపులో సింగ్:

పోలీసుల అదుపులో సింగ్:

అమెరికా చట్టాల ప్రకారం ఇక్బాల్ సింగ్‌పై సోమవారం మొదటి మరియు మూడవ డిగ్రీ హత్య కేసు నమోదైందని కోర్టు రికార్డులు చెపుతున్నాయి. ఇక్బాల్ సింగ్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అతనికి బెయిల్ నిరాకరించారు. సింగ్ తరఫున కోర్టులో వాదించడానికి ఒక న్యాయవాది కూడా లేదని సమాచారం. 1983లో కువైట్ వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన సింగ్.. షాట్‌ పుట్‌లో భారత్‌కి కాంస్య పతకాన్ని అందించారు.

 పంజాబ్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌‌గా విధులు:

పంజాబ్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌‌గా విధులు:

1980లో వివిధ పోటీల్లో ఇక్బాల్ సింగ్ చూపిన ప్రతిభకి స్పోర్ట్స్ కోటాలో తొలుత టాటా స్టీల్‌లో ఉద్యోగం వచ్చింది. కొన్ని నెలల వ్యవధిలోనే పంజాబ్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌‌గా చేరారు. సింగ్ జలంధర్‌లో డ్యూటీ చేసినట్లు తెలుస్తోంది. 1988లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన పర్మీట్ మీట్‌లో సింగ్ బంగారు పతకం సాధించగా.. షాట్ పుట్‌ని 18.77 మీటర్లు విసిరినట్లు రికార్డులు చెప్తున్నాయి.

 ఈ వార్తని నమ్మలేకపోతున్నా:

ఈ వార్తని నమ్మలేకపోతున్నా:

ఇక్బాల్ సింగ్ హత్యలు చేయడంపై అతని సహచరుడు మీడియాతో మాట్లాడుతూ... 'నేను ఈ వార్తని నమ్మలేకపోతున్నా. ఇక్బాల్ సింగ్ అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అతని ఇంటికి కూడా నేను వెళ్లాను. సింగ్ భార్య చాలా ప్రేమగా మాట్లాడారు. అతని తల్లి వయసు దాదాపు 90. అక్కడ ఏం జరిగిందో? నాకు తెలీదు. కానీ గత కొన్ని నెలలుగా సింగ్ మానసిక ఒత్తిడికి గురవుతూ.. చికిత్స తీసుకుంటున్నాడని మాత్రం తెలుసు. అతని పిల్లలు కూడా బాగా సెటిలయ్యారు' అని తెలిపారు.

'ధోనీని ఆ చివరి ఓవర్‌లో పరుగులు చేయనివ్వలేదు.. అదే నా కెరీర్‌లో పెద్ద సక్సెస్'

Story first published: Wednesday, August 26, 2020, 15:18 [IST]
Other articles published on Aug 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+