
టీ20 మ్యాచ్‌ని గుర్తుచేసుకున్న బ్రావో:
ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి 10 రోజులు దాటినా.. మహీతో ఉన్న అనుభవాలను,అనుబంధాలను క్రికెటర్లు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఆడుతున్న డ్వేన్ బ్రావో కూడా మహీకి సంబందించిన ఓ ఘటనను తాజాగా నెమరువేసుకున్నాడు. 2016లో ఫ్లోరిడా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ని బ్రావో గుర్తు చేసుకున్నాడు.

నా కెరీర్‌లో పెద్ద సక్సెస్ అదే:
'ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అయిన ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నా కూడా ఆ మ్యాచ్‌లో 6 పరుగులను నేను కట్టడి చేశాను. చివరి ఓవర్లలో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అందుకే ఆ మ్యాచ్‌లో మహీని నిలువరించడం నా కెరీర్‌లో పెద్ద సక్సెస్‌గా భావిస్తాను. ధోనీకి మరిన్ని ఓవర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేయాలని ఆశించాను. కానీ ఇక అవకాశం లేదు. ఒక ప్లేయర్‌గా ధోనీ అస్సలు కంగారుపడడు. ఎంత ఒత్తిడినినైనా అధిగమించగలడు. సహచరుల్లోనూ అతను నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. గొప్ప కెప్టెన్ల లక్షణం అది' అని డ్వేన్ బ్రావో తెలిపాడు.

మహీ తడబాటు కారణంగా:
2016లో ఫ్లోరిడా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (100: 49 బంతుల్లో 5x4, 9x6) సెంచరీ బాదడంతో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్ ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (110 నాటౌట్: 51 బంతుల్లో 12x4, 5x6) మెరుపు సెంచరీ సాధించడంతో అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ చివరి ఓవర్‌లో ఎంఎస్ ధోనీ (43: 25 బంతుల్లో 2x4, 2x6) తడబాటు కారణంగా.. ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసింది బ్రావోనే.

2011 నుంచి సీఎస్‌కేకే:
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో చాలాకాలంగా కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. ధోనీని తన సోదరుడిగా బావిస్తుంటాడు. 2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన బ్రావో.. 104 మ్యాచుల్లో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్'ని కూడా సొంతం చేసుకున్నాడు. సీపీఎల్ 2020 ఆడుతున్న బ్రావో.. ఐపీఎల్ 2020 కోసం సెప్టెంబర్ 10 తర్వాత యూఏఈ వెళ్లనున్నాడు.


Click it and Unblock the Notifications

భర్తకు దక్కని చోటు.. నొచ్చుకున్న సైనా నెహ్వాల్ మనసు!!










