జేకే టైర్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ లోగో ఆవిష్కరణ!
భారతీయ మోటార్‌స్పోర్ట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సీటీఆర్-జేకే టైర్ ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ (FMSCI) ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్' నయా సీజన్‌కు తెరలేచింది. ఈ అప్‌కమింగ్ సీజన్‌కు సంబంధించిన లోగోను బుధవారం మోటార్ స్పోర్ట్ ప్రముఖులు ఆవిష్కరించారు.
చెన్నై టర్బో రైడర్స్ (CTR), జేకే టైర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ.. దేశంలో మోటార్‌స్పోర్ట్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఈ ఛాంపియన్‌షిప్ తొలి రౌండ్ పోటీలు సెప్టెంబర్ 11న కోయంబత్తూరులోని 'కరి మోటార్ స్పీడ్‌వే'లో ప్రారంభం కానున్నాయి. ప్రతిష్టాత్మక గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 11 నుంచి 13 వరకు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్యూట్‌లో జరుగుతుంది. భారత్ తొలి అంతర్జాతీయ మోటర్‌రేస్‌కు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్యూట్ ఆతిథ్యం ఇచ్చింది.

మూడో రౌండ్ అక్టోబర్ 23 నుంచి 25 వరకు కోయంబత్తూరులో.. నాలుగో రౌండ్ నవంబర్ 13 నుంచి 15 వరకు బెంగళూరులోని బ్రెన్ రేస్‌వేలో జరగనుంది. దాదాపు మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్.. దేశంలోని యువ రేసింగ్ డ్రైవర్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక ప్రధాన వేదికగా నిలుస్తోంది. వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ రేసర్లు ఈ పోటీల్లో తలపడనున్నారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయనతో పాటు ఎఫ్‌ఐఏ (FIA) అంతర్జాతీయ కార్టింగ్ కమిషన్ అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీం, ఎఫ్‌ఎమ్‌ఎస్‌సిఐ అధ్యక్షుడు అరిందం ఘోష్, సిటిఆర్ డైరెక్టర్ డాక్టర్ శ్వేతా సుందీప్ ఆనంద్, జేకే టైర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాసు అల్లాఫన్ సహా పలువురు క్రీడా ప్రముఖులు, రేసింగ్ జట్లు పాల్గొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications