For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాకిస్థాన్ బళ్లెం వీరుడికి ఫేక్ ట్వీట్ సెగ.. నీరజ్ చోప్రాను కొనియాడేందుకు సిగ్గు లేదా? అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చ

Fake Tweet Of Neeraj Chopras Pakistan Rival Arshad Nadeem Lauding Indian idol Goes Viral

హైదరాబాద్: పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు ఫేక్ ట్వీట్ సెగ తగిలింది. సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌‌లో ఐదో స్థానంతోనే సరిపెట్టకున్న నదీమ్ పేరిట.. భారత బళ్లెం వీరుడు, స్వర్ణ విజేత నీరజ్ చోప్రా‌ను కొనియాడినట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. 'స్వర్ణ పతకం గెలిచిన నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు'.. 'సారీ పాకిస్థాన్ నేను మీ కొరకు పతకం గెలవలేక పోయాను'అని నదీమ్ పేర్కొన్నట్లు ఉన్న ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించారు. దాంతో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ గత 24 గంటలుగా తెగ వైరల్ అయింది. అయితే ఈ ట్వీట్‌పై పాకిస్థాన్ తీవ్ర దుమారం రేగింది.

నీరజ్ చోప్రా నీ ఐడలా? సిగ్గు లేదా..

నీరజ్ చోప్రా నీ ఐడలా? సిగ్గు లేదా..

ముఖ్యంగా భారతీయ అథ్లెట్ అయిన నీరజ్ చోప్రాను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 'ఐడల్' గా పేర్కొనడం ఏంటని పాక్ ఫ్యాన్స్ మండి పడ్డారు. తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్‌ను ఐడల్‌గా పేర్కొనడం ఏంటనీ.. అందులో దాయాది దేశానికి చెందిన అథ్లెట్‌ను ఐడల్‌గా పేర్కొంటావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మెడల్ గెలవక పోవడమే కాకుండా భారత అథ్లెట్‌ను పొగడటానికి సిగ్గులేదా? అని కూడా ప్రశ్నించారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం నదీమ్‌ను అభినందించారు. క్రీడా స్పూర్తి అంటే ఇదేనని కొనియాడారు.

నదీమ్ పేరిట ఫేక్ ట్వీట్..

నదీమ్ పేరిట ఫేక్ ట్వీట్..

ఇరు దేశాల్లో ఈ ట్వీట్ వైరల్‌ అయిన కొద్ది సేపటికే అర్షద్ నదీమ్ ఖాతా నుంచి ట్వీట్ మాయమైంది. ఆ వెంటనే మరో ట్వీట్ కనిపించింది. 'టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో పోటీలో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. అర్షద్‌తో కావాలనే ఆ ట్వీట్ బలవంతంగా తీసేయించి.. మరో ట్వీట్ పెట్టించారని భారత అభిమానులు ఆరోపించారు. మరోవైపు పాక్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేకే అర్షద్ నదీమ్ ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లు కొంత మంది అభిప్రాయపడ్డారు. అయితే ఆ ట్విటర్ అకౌంట్ అర్షద్ నదీమ్‌దే కాదని తెలిసింది. ఎవరో అతని పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు స్పష్టమైంది. సాధారణంగా సెలెబ్రిటీలకు ఉండే బ్లూ టిక్ ఆ ఖాతాకు లేదు. పైగా పాకిస్థాన్ మీడియా సైతం అది ఫేక్ ట్విటర్ అకౌంటని తేల్చింది. ఫేక్ ట్వీట్ అని తెలిసినా అతనిపై ట్రోలింగ్ ఆగడం లేదు.

షేక్ హ్యాండ్ వైరల్

షేక్ హ్యాండ్ వైరల్

గతంలో కూడా నీరజ్ చోప్రా, నదీమ్ షేక్ హ్యాండ్ వైరల్‌గా మారింది. 2018 ఏషియన్ గేమ్స్‌లో కూడా వీరిద్దరూ పోటీ పడ్డారు. అప్పుడు నీరజ్ స్వర్ణ పతకం గెలవగా.. అర్షద్ నదీమ్ కాంస్య పతకం నెగ్గాడు. కాగా, పతకాలు బహుకరించిన తర్వాత నదీమ్, నీరజ్ తమ దేశ జెండాలను భుజాలపై వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చు కోవడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో 8 సార్లు ఫైనల్‌లో తలపడగా.. ప్రతీ సారి నీరజ్‌దే పై చేయి అయ్యింది.

ఐదో స్థానంలోనే పాక్ బళ్లెం వీరుడు..

ఐదో స్థానంలోనే పాక్ బళ్లెం వీరుడు..

టోక్యో ఒలింపిక్స్‌‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసరగా.. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు వడ్లెచ్ 86.67 మీటర్లు, వాస్లీ 85.44 మీటర్లు విసిరి రజతం, కాంస్య గెలుచుకున్నారు. అయితే ఫైనల్ రౌండ్‌లో జర్మన్‌కు చెందిన వెబర్ నాలుగో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ 84.62 మీటర్లు విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై సర్వ్రత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 8, 2021, 20:27 [IST]
Other articles published on Aug 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+