Sushil Kumar ఆచూకీ చెబితే రూ. లక్ష బహుమతి!

న్యూఢిల్లీ: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు. సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.

రూ. లక్ష బహుమతి..
ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి, అరెస్ట్‌కు సహకరించినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్‌లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్‌లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే.

లొంగిపోనున్న సుశీల్..
ఇక సుశీల్ కుమార్ పోలీసులకు లొంగిపోయే పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ -ఎన్‌సీఆర్‌లోని ఏ కోర్టులోనైనా సుశీల్ ఒకటి లేదా రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశాలున్నాయి. ఈ మేరకు మోడల్ టౌన్ పోలీసులకు వాట్సాప్ సమాచారం అందింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ సుశీల్‌తో పాటు అతని స్నేహితులను అరెస్టు చేయడానికి విస్తృతంగా గాలిస్తున్నామన్నారు. ఇంతేకాదు సుశీల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నామన్నారు.

నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో..
అయితే ఇంతలోనే సుశీల్ తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తును దాఖలు చేయబోతున్నట్లు సమాచారం అందింది. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో అతని ప్రయత్నాలు ఆగిపోయాయన్నారు. అతని బంధువులను ప్రశ్నించినప్పుడు, కోర్టులో లొంగిపోవడానికి సుశీల్ సిద్ధమవుతున్నాడని వారు తెలిపారన్నారు. అయినప్పటికీ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో సుశీల్ తన స్నేహితులతో కలిసి నజాఫ్‌గఢ్-బహదూర్‌గఢ్-జజ్జర్ తదితర ప్రాంతాల్లో దాక్కున్నట్లు గుర్తించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications