Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. దేశాన్ని కుదిపేసిన రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో తుది తీర్పు!

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ ప్రెసిడెంట్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌‌కు బిగ్ రిలీఫ్ లభించింది. దేశాన్ని కుదిపేసిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్ భూషణ్‌తోపాటు.. డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసిన వినోద్ తోమర్‌లపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం గురువారం తన తుది తీర్పును వెల్లడించింది. ఈ ఇద్దరిపై వచ్చిన లైంగిక ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చుతూ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ అశ్వినీ పన్వార్ ఆదేశాలు జారీ చేశారు.

Delhi Court Clears Brij Bhushan Sharan Singh in Women Wrestlers Sexual Harassment Case

మూడేళ్ల క్రితం భారత ప్రముఖ రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం జరిగిన ఈ నిరసనలు అప్పట్లో దేశాన్ని కుదిపేసాయి. భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్‌తో పాటు సాక్షి మాలిక్ వంటి తదిరత రెజ్లర్లు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని తమ పతకాలను గంగలో విసిరేసుందుకు కూడా సిద్దమయ్యారు. రెజ్లర్ల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను డబ్ల్యూఎఫ్‌పై అధ్యక్ష పదవి నుంచి తప్పించి విచారణ జరిపించింది.

గత రెండేళ్లుగా వాదనలు జరగ్గా.. తాజాగా తుది తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. 'నేను ఏ తప్పు చేయలేదు. నాపై కుట్ర పన్నారని నేను మొదటి నుంచి చెబుతున్నా. నేను తప్పు చేశానని తేలితే ఊరి వేసుకుంటానని మొదటి రోజే చెప్పా. కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పు నాకు, నా అనుచరులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ రోజు నాకు ఎంతో సంతోషకరమైన రోజు. జూనియర్ అథ్లెట్ల కోసం మేం పోరాడాం. దాంతోనే మాపై లేని పోని ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేశారు.'అని బ్రిజ్ భూషణ్ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, August 3, 2026, 13:49 [IST]
Other articles published on Aug 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+