Sanket Mahadev Sargar: పాన్‌లు అమ్మినోడు భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు!

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గార్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. గాయం కారణంగా కేజీ బరువు తేడాలో స్వర్ణపతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలోనే 135 కేజీల బరువెత్తిన మహదేవ్.. రెండు, మూడో ప్రయత్నంలో 139 కేజీల బరువు ఎత్తలేకపోయాడు. రెండో ప్రయత్నంలోనే గాయపడ్డ అతను.. మూడోసారి ప్రయత్నించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతని కుడి మోచేతి సహకరించలేదు.

కేజీ తేడాలో గోల్డ్ మిస్..
స్నాచ్ విభాగంలో మూడో ప్రయత్నంలో 113 కేజీల బరువు ఎత్తి టాప్‌లో నిలిచినప్పటికీ.. మలేషియా వెయిట్ లిఫ్టర్ అనిఖ్ కస్దాన్ మహదేవ్ అతన్ని అధిగమించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 142 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించిన అనిఖ్.. స్నాచ్ విభాగంలో 107 కేజీలే ఎత్తాడు. ఓవరాల్‌గా 249 కేజీలు ఎత్తి టాప్‌లో నిలిచాడు. శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు 225 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్ విభాగంలో 105 కేజీలు ఎత్తిన శ్రీలంక ప్లేయర్.. క్లీన్ అండ్ జర్క్‌లో 120 కేజీలు ఎత్తాడు.

ఎవరీ సంకేత్..
భారత్‌కు తొలి పతకాన్ని అందించిన సంకేత్ మహదేవ్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. సరైన ఉద్యోగం లేక తండ్రికి చెందిన ఓ చిన్న పాన్‌షాప్, ఫుడ్ స్టాల్‌ను నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఓవైపు తనకు ఇష్టమైన వెయిట్ లిఫ్టింగ్‌ను సాధన చేస్తూనే మరోవైపు పాన్ షాప్‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహరాష్ట్రలోని సంగ్లీకి చెందిన సంకేత్ మహదేవ్.. పాన్‌లు కట్టిన చేతులతోనే భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. కామెన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన రజత పతకమే అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.

టోర్నీకి ముందే...
2021 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తీవ్రంగా నిరాశపర్చిన సంకేత్ అద్భుతంగా పుంజుకున్నాడు. స్నాచ్ విభాగంలో అందరికన్నా ఎక్కవు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. 6 కేజీల వ్యత్యాసంతో నిలిచిన మహదేవ్ స్వర్ణపతకం గెలిచేలా కనిపించాడు. కానీ క్లీన్ అండ్ జర్క్‌లో విఫలమవడంతో రెండో స్థానంలో నిలిచిపోయాడు. ఈ విజయానికి ముందు ఎకనామిక్ టైమ్స్‌తో మాట్లాడిన సర్గార్.. ఈ టోర్నీ తర్వాత తనకు గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఒలింపిక్ మెడల్ సాధించడమే..
'నేను ఈ పోటీల్లో బంగారు పతకం గెలిస్తే నాకు తగిన గుర్తింపు లభిస్తోంది. నా తండ్రికి ఆర్థిక భరోసా ఇవ్వడం నా లక్ష్యం. అలాగే నా కోసం ఎంతో చేసిన ఆయనకు విజయం ద్వారా కృతజ్ఞతలు తెలపడం నా కల. పారిస్ 2024 ఒలింపిక్స్ ఆడటమే నా లక్ష్యం. దాని కోసం నేను 61 కేజీల విభాగానికి మారుతా. ఇది చాలా కష్టం. కానీ ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కాబట్టి ఆ దిశగా సన్నదమవుతా. క్యాష్ అవార్డ్స్ వచ్చినా.. ఇంకే బహుమానం అందినా నా లక్ష్యం అయితే మారదు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం సాధించడమే నా ప్రధాన లక్ష్యం'అని సంకేత్ మహదేవ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications