Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CWG 2022: లాన్ బౌల్స్‌లో పసిడి గెలిచింది అమ్మాయిలు కాదు.. ఆంటీలు!

 CWG 2022: Unknown facts about Lawn Bowls Player Pinki Kaushik Singh

బర్మింగ్‌హామ్: అంతగా పరిచయం లేని లాన్ బౌల్స్‌లో భారత మహిళల టీమ్ అద్భుత ఆటతో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల ఫోర్స్ ఫైనల్లో లవ్లీ చౌబే(లీడ్), పింకి(సెకండ్), నమన్‌మోని సైకియా(థర్డ్), రూపా రాణి టిర్కే(స్కిప్)తో కూడి భారత బృందం 17-10తో సౌతాఫ్రికాపై గెలిచింది. స్వర్ణం గెలిచిన ఈ నలుగురికీ క్రీడాకారులుగా ఇది రెండో ఇన్నింగ్స్‌ అని చెప్పవచ్చు.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్లు అమ్మాయిలే కాదు ఆంటీలు. వయసును లెక్క చేయకుండా క్రీడలపై ఉన్న మక్కువతో అహర్నిషులు శ్రమించి అనుకున్నది సాధించారు.

వయసును లెక్క చేయకుండా..

టీమ్ లీడ్ చేసిన లవ్లీ చౌబే వయసు 42 ఏళ్లు, మాజీ స్ప్రింటర్, జార్ఖండ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్. మాజీ క్రికెటర్ అయిన పింకీకి 41 ఏళ్లు. ఢిల్లీలో పీఈటీగా పని చేస్తోంది. రూపా రాణి టిర్కీకి 34 ఏళ్లు, మాజీ కబడ్డీ క్రీడాకారిణి, జార్ఖండ్ జిల్లా క్రీడాధికారిగా ఉద్యోగం చేస్తోంది. నయన్‌మోని సైకియాకు 33 ఏళ్లు, మాజీ వెయిట్‌లిఫ్టర్, అసోం అటవీ అధికారి.

గాయాల కారణంగా లవ్లీ, నయన్‌మోని కెరీర్‌లు అర్ధాంతరంగా ఆగిపోతే క్రీడల్లో కొనసాగాలనే ఆసక్తితో మరో కొత్త ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది.

అనుకోకుండా లాన్ బెల్స్‌లోకి...

అనుకోకుండా లాన్ బెల్స్‌లోకి...

ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్‌ ఆడిన పింకీ పని చేస్తున్న పాఠశాల ఒకసారి నేషనల్‌ లాన్‌ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆటను చూసిన ఆమె కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది. టీమ్‌ గేమ్‌ కాకుండా వ్యక్తిగత క్రీడకు మారాలనుకున్న రూప అనుకోకుండా బౌల్స్‌ వైపు వచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పుడు జార్ఖండ్‌ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారం కబడ్డీకంటే ఎక్కువగా ఉండటంతో ఆమె కూడా ఇందులోనే కొనసాగింది.

మాజీ క్రికెటర్ అంపైర్ పర్యవేక్షణలో...

మాజీ క్రికెటర్ అంపైర్ పర్యవేక్షణలో...

మన దేశంలో లాన్‌ బౌల్స్‌ ఆడేందుకు తగిన సౌకర్యాలు కనిపించవు. ప్రమాణాలకు అనుగుణంగా లాన్స్‌ లేకపోవడంతో పాటు బౌల్స్‌ కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీరు ప్రతికూలతలను దాటి ఇలాంటి విజయం సాధించడం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మాజీ క్రికెట్‌ అంపైర్‌ అయిన మధుకాంత్‌ పాఠక్‌ వీరందరికీ కోచింగ్‌ ఇచ్చారు.

2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలకు ముందు భారత ఆటగాళ్లు సింథటిక్‌ గ్రాస్‌పై ప్రాక్టీస్‌ చేయగా... అక్కడికి వెళ్లాక సహజమైన పచ్చిక ఎదురైంది. దాంతో వారి ఆటలో గందరగోళం కనిపించింది. సహజ పచ్చికపై బౌల్‌ చేసేందుకు ఎక్కువగా భుజ బలం అవసరం. అక్కడ దెబ్బతిన్న వీరు ఆ తర్వాత సాధనను మార్చారు. ప్రైవేట్‌ రిసార్ట్‌లలో మాత్రమే ఉండే సౌకర్యాలను సొంత ఖర్చులతో ఉపయోగించుకున్నారు.

గత పదేళ్లుగా ఒకే జట్టుగా..

గత పదేళ్లుగా ఒకే జట్టుగా..

వేర్వేరు పోటీల ద్వారా పరిచయమైన ఈ నలుగురు దాదాపు పదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో పెయిర్స్‌ విభాగంలో రూప, పింకీ కాంస్యానికి చేరువగా వచ్చి తృటిలో పతకం కోల్పోయారు. వీరిద్దరితో పాటు 2014, 2018లో లవ్లీతో కలిసి 'ట్రిపుల్స్‌' ఆడగా క్వార్టర్‌ ఫైనల్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు నయన్‌మోని కలిసి రాగా నలుగురి బృందం 'ఫోర్స్‌'లో గోల్డ్‌వైపు సాగిపోయింది. గత ఓటముల బాధ తాజా విజయపు ఆనందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. గెలుపు ఖరారైన క్షణాన, పతకాలు అందుకునేటప్పుడు వారి సంబరాల్లో అది స్పష్టంగా కనిపించింది.

Story first published: Wednesday, August 3, 2022, 19:14 [IST]
Other articles published on Aug 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+