
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లోనూ వరల్డ్ చాంపియన్, భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తన జోరును కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మహిళల బాక్సింగ్ 50 కేజిల లైట్ ఫ్లైవెయిట్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ 5-0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. దాంతో నిఖత్ జరీన్‌కు పతకం ఖాయం అయింది. సెమీఫైనల్లో ఓడినా ఆమెకు కాంస్యం దక్కుతుంది. అయితే ఈ విజయానంతం ఆమె చేసిన ఓ పని సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బుధవారం నిఖత్ జరీన్ తల్లి పర్వీన్ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్ జరీన్ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక నిఖత్ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్ మాత్రం నిరాశపరిచింది. మిడిల్ వెయిట్ క్వార్టర్‌ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్ ఆశిష్ కుమార్(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్ బోవెన్ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 18 పతకాలు చేరాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2022 విజేతలు..
వెయిట్ లిఫ్టింగ్...
1. మీరాబాయి చాను (స్వర్ణం)
2. జెరెమి లాల్రినుంగ (స్వర్ణం)
3. అచింత షెవులి (స్వర్ణం)
4. బింద్యారాణి దేవి (రజతం)
5. సంకేత్ సర్గర్ (రజతం)
6. వికాస్ ఠాకూర్ (రజతం)
7. గురురాజ పూజారి (కాంస్యం)
8. హర్జీందర్ కౌర్ (కాంస్యం)
9. లవ్‌ప్రీత్ సింగ్ (కాంస్యం)
10. గుప్రీత్ సింగ్(కాంస్యం)
జూడో..
11. సుశీల లిక్మాబమ్ (సిల్వర్)
12. విజయ్ యాదవ్ (కాంస్యం)
13. తులిక్ మన్ (సిల్వర్)
లాన్ బౌల్స్
14. రూపా/లవ్లీ/నయాన్మోని/పింకి (స్వర్ణం)
టేబుల్ టెన్నిస్
15. శరత్/హర్మీత్/సాతియన్/సనిల్ (స్వర్ణం)
బ్యాడ్మింటన్
16. టీమిండియా (సిల్వర్)
స్క్వాష్
17. సౌరవ్ గోషల్ (కాంస్యం)
ట్రాక్ అండ్ ఫీల్డ్
18. తేజస్విన్ శంకర్ (కాంస్యం)