For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CWG 2022: ఖాతా తెరిచిన భారత్.. రజతంతో మెరిసిన సంకేత్ మహదేవ్!

 CWG 2022: Sanket Mahadev Sargar wins silver in mens 55kg weightlifting, gets Indias first medal

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గార్ సిల్వర్ మెడల్‌తో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకున్నాడు.

క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలోనే 135 కేజీల బరువెత్తిన మహదేవ్.. రెండు, మూడో ప్రయత్నంలో 139 కేజీల బరువు ఎత్తలేకపోయాడు. రెండో ప్రయత్నంలోని గాయపడ్డ అతను.. మూడోసారి ప్రయత్నించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతని కుడి మోచేతి సహకరించలేదు.
స్నాచ్ విభాగంలో మూడో ప్రయత్నంలో 113 కేజీల బరువు ఎత్తి టాప్‌లో నిలిచినప్పటికీ.. మలేషియా వెయిట్ లిఫ్టర్ అనిఖ్ కస్దాన్ మహదేవ్‌ను అధిగమించి గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్నాడు.

క్లీన్ అండ్ జర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 142 కేజీల బరువుత్తి రికార్డు సృష్టించిన అనిఖ్.. స్నాచ్ విభాగంలో 107 కేజీలే ఎత్తాడు. ఓవరాల్‌గా 249 కేజీలు ఎత్తి టాప్‌లో నిలిచాడు. శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు 225 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్ విభాగంలో 105 కేజీలు ఎత్తిన శ్రీలంక ప్లేయర్.. క్లీన్ అండర్ జర్క్‌లో 120 కేజీలు ఎత్తాడు.

భారత స్టార్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్‌ 100 మీ బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌ సెమీఫైనల్‌ హాట్‌-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్‌ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్‌ రేసు ఆదివారం జరగనుంది.

బ్యాడ్మింటన్‌లో ఇప్పటికే పాక్‌ను చిత్తు చేసి ఊపు మీదున్న భారత్ గ్రూప్‌-ఏలో లంకపైనా ఆధిక్యం కొనసాగిస్తోంది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్ 3-0 లీడ్‌లోఉంది. ఇక పురుషుల మారథాన్‌ ఫైనల్‌లో భారత్‌ అథ్లెట్‌ రావత్‌ 17 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Story first published: Saturday, July 30, 2022, 17:12 [IST]
Other articles published on Jul 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+