Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CWG 2022: సిగ్గు చేటు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందే.. టాప్‌లో పంజాబ్, హర్యానా!

CWG 2022: Punjab and Haryana top state-wise representation in Commonwealth Games

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు ఖతర్నాక్ షోతో దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే 18 మెడల్స్(5 బంగారు, 6 రజతం, 7 కాంస్యం) సాధించిన భారత్ మెడల్స్ ట్యాలీలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్నఈ టోర్నీలో భారత్ 215 మంది అథ్లెట్ల జంబో టీమ్‌తో బరిలోకి దిగింది. అయితే 215 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహించేది కేవలం 11 మంది మాత్రమే. స్టాట్స్‌ ఆఫ్ ఇండియా.ఇన్ లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఏడుగురు అథ్లెట్లు కామన్వెల్త్ బరిలోకి దిగగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు మాత్రమే అవకాశం దక్కించుకున్నారు.

క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఊదరగొడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఈ సంఖ్యను చూసి సిగ్గు తెచ్చుకోవాలని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గెలిచిన అథ్లెట్లపై కోట్లు కుమ్మరించడం ప్రోత్సాహకం కాదని, అందరికి మౌళిక వసతులు కల్పించి, ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ప్రోత్సహించాలని హితవు పలుకుతున్నారు. స్టార్ ప్లేయర్లకు ప్రోత్సాహకం అందించాల్సిన అవసరం లేదని, వారి సంపాదన కోట్లలోనే ఉందంటున్నారు.

ఇక 215 మంది అథ్లెట్లలో ఎక్కువ భాగం పంజాబ్, హర్యానా రాష్టాలకు చెందినవారే ఉండటం విశేషం. ఈ రెండు రాష్ట్రాల నుంచి (65 మంది) 30 శాతం మంది అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్ బరిలో నిలిచారు. హర్యానా నుంచి 18.1 శాతం ఉండగా.. పంజాబ్ నుంచి 12.1 శాతం ఉన్నారు. అయితే పంజాబ్ నుంచి పురుషుల హాకీ ప్లేయర్లు, హర్యానా నుంచి మహిళల హాకీ ప్లేయర్లు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇక హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, మహరాష్ట్రల నుంచే 50 శాతం అథ్లెట్లు ఉన్నారు. తెలంగాణ జనాభాలో 1/12వ వంతు ఉన్న మణిపూర్ నుంచి కూడా ఏడుగురు అథ్లెట్లు బరిలోకి దిగారు.

CWG 2022: Punjab and Haryana top state-wise representation in Commonwealth Games

కామన్వెల్త్ గేమ్స్ 2022 విజేతలు..

వెయిట్ లిఫ్టింగ్...

1. మీరాబాయి చాను (స్వర్ణం)
2. జెరెమి లాల్రినుంగ (స్వర్ణం)
3. అచింత షెవులి (స్వర్ణం)
4. బింద్యారాణి దేవి (రజతం)
5. సంకేత్ సర్గర్ (రజతం)
6. వికాస్ ఠాకూర్ (రజతం)
7. గురురాజ పూజారి (కాంస్యం)
8. హర్జీందర్ కౌర్ (కాంస్యం)
9. లవ్‌ప్రీత్ సింగ్ (కాంస్యం)
10. గుప్రీత్ సింగ్(కాంస్యం)

జూడో..
11. సుశీల లిక్మాబమ్ (సిల్వర్)
12. విజయ్ యాదవ్ (కాంస్యం)
13. తులిక్ మన్ (సిల్వర్)

లాన్ బౌల్స్
14. రూపా/లవ్లీ/నయాన్మోని/పింకి (స్వర్ణం)

టేబుల్ టెన్నిస్
15. శరత్/హర్మీత్/సాతియన్/సనిల్ (స్వర్ణం)

బ్యాడ్మింటన్
16. టీమిండియా (సిల్వర్)

స్క్వాష్
17. సౌరవ్ గోషల్ (కాంస్యం)

ట్రాక్ అండ్ ఫీల్డ్
18. తేజస్విన్ శంకర్ (కాంస్యం)

Story first published: Thursday, August 4, 2022, 19:11 [IST]
Other articles published on Aug 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+