Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Commonwealth Games 2026: చరిత్ర సృష్టించిన భారత్.. షాట్‌పుట్‌లో డబుల్ బోనాంజ!

భారత పారా షాట్‌పుట్ ప్లేయర్స్ సోమన్ రాణా, శుభమ్ జ్యువెల్‌లు చరిత్ర సృష్టించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఎఫ్ 57 ఈవెంట్‌లో భారత ఆటగాళ్లు సోమన్ రాణా గుండును 13.40 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. మరో భారత అథ్లెట్, శుభమ్ జ్యువెల్ 13.28 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతకం.

పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాన్ని, సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆసియా గేమ్స్‌ బ్రాంజ్ మెడలిస్ట్ ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతని తర్వాత మరో భారత ప్లేయర్ అయిన సెల్వ ప్రభు తిరుమరన్ 16.52 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

Commonwealth Games 2026 Soman Rana Wins Gold Shubam Juyal Takes Silver in Men s Shot Put F57

అంతకుముందు దివ్యాంగుల అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల T54 1500 మీటర్ల రేసు ఫైనల్లో పోటీపడిన భారత ప్లేయర్ రమేష్ షణ్ముగం, 3 నిమిషాల 23.59 సెకన్ల సమయంలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచాడు.

మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో.. భారత ప్లేయర్ ప్రియాంక గోస్వామి 45 నిమిషాల 53.93 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచింది. ఇది ఆమె వ్యక్తిగత బెస్ట్ రికార్డ్. రూల్స్ ప్రకారం చివరి నమిషంలో మరో అథ్లెట్ రవీనా డిస్‌క్వాలిఫై అయ్యారు.

Story first published: Saturday, August 1, 2026, 18:20 [IST]
Other articles published on Aug 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+