Commonwealth Games 2026: భారత్‌కు మరో రెండు స్వర్ణ పతకాలు!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు దుమ్మురేపారు. శనివారం మరో రెండు స్వర్ణాలు సాధించారు. ముందుగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో ప్రీతి 5-0 తేడాతో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థిపై పంచ్‌లతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఐదుగురు జడ్జీలు ప్రీతి పవార్‌ను ఏకగ్రీవంగా విజేగత ప్రకటించారు. ప్రీతికి కెనడా బాక్సర్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఆ తర్వాత జరిగిన మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో జైస్మిన్ లాంబోరియా స్వర్ణం సాధించింది. ఫైనల్లో నార్తర్మ్ ఐర్లాండ్ కు చెందిన మైఖేలా వాల్ష్ పై జైస్మిన్ 5-0 తేడాతో విజయం సాధించింది. జైస్మిన్ పంచ్‌లకు మైఖేలా వద్ద సమాధానం లేకుండా పోయింది. మరోవైపు పురుషుల బాక్సింగ్ 55 కేజీల విభాగంలో జాదుమణి రజతం దక్కించుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ జై డిక్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు.

భారత పారా షాట్‌పుట్ ప్లేయర్స్ సోమన్ రాణా, శుభమ్ జ్యువెల్‌లు చరిత్ర సృష్టించారు. వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఎఫ్ 57 ఈవెంట్‌లో భారత ఆటగాళ్లు సోమన్ రాణా గుండును 13.40 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. మరో భారత అథ్లెట్, శుభమ్ జ్యువెల్ 13.28 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతకం కావడం గమనార్హం.
పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాన్ని, సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆసియా గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. అతని తర్వాత మరో భారత ప్లేయర్ అయిన సెల్వ ప్రభు తిరుమరన్ 16.52 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

