Commonwealth Games: పసిడి వేటలో గోల్డెన్ భాయ్.. ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా..!
కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నీలో భారత బళ్లెం వీరుడు, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రాతో పాటు భారత్‌కు చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ ఫైనల్ చేరారు.
స్టార్ జావెలిన్ త్రోయర్స్ శ్రీలంక బళ్లెం వీరుడు రుమేష్ తరంగా, ఒలింపిక్ ఛాంపియన్, పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. మాజీ వరల్డ్ ఛాంపియన్ జూలియస్ యెగో(కెన్యా) క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మొత్తం 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఎవరూ క్వాలిఫికేషన్ మార్క్ 84 మీటర్లను అందుకోలేకపోయారు. బలమైన గాలుల కారణంగా ఈటెను విసరడం అథ్లెట్లకు కష్టంగా మారింది.

ఈ క్వాలిఫికేషన్ రౌండ్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తొలి యత్నంలో 76.28 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలో 79.61 మీటర్లతో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోని ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగా 82.84 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలవగా.. గ్రెనెడియన్ జావెలిన్ త్రోయర్ ఆండర్సన్ పీటర్స్ 81.29 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.
సౌతాఫ్రికా బళ్లెం వీరుడు డౌ స్మిత్ 80.64 మీటర్లతో మూడో స్థానంలో నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన బెన్ ఈస్ట్ 80.38 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా 79.61 మీటర్ల దూరంతో ఐదో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 78.63 మీటర్లతో ఏడో స్థానంలో నిలవగా.. భారత్‌కు చెందిన రోహిత్ యాదవ్ 78.37 మీటర్లతో 9వ స్థానం, యశ్‌వీర్ సింగ్ 78.36 మీటర్లతో 10 స్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రో ఫైనల్స్ శనివారం జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

