Commonwealth Games: నిరాశపర్చిన నీరజ్ చోప్రా.. భారత్‌కే సిల్వర్, బ్రాంజ్ మెడల్!
భారత జావెలిన్ త్రోయర్, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా తీవ్రంగా నిరాశపర్చాడు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ టూటైమ్ ఒలింపిక్ విజేత.. రజతంతో సరిపెట్టాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన జావెలిన్ త్రోయర్ ఫైనల్లో నీరజ్ చోప్రా 85.83 మీటర్లు దూరం ఈటెన్ విసిరి రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం చేజారినా.. భారత్‌కు ఈ ఈవెంట్‌లో డబుల్ బోనాంజ తగిలింది. కాంస్య పతకం కూడా భారత్‌నే వరించింది.
శ్రీలంకకే స్వర్ణం..
శ్రీలంకకు చెందిన రమేశ్ పతిరగే 89.75 మీటర్ల త్రోతో స్వర్ణం పతకాన్ని ఎగరేసుకుపోయాడు. భారత్‌కే చెందిన యశ్వీర్ సింగ్ 85.41 మీటర్ల దూరంతో మూడో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ చోప్రాకు ఇది రెండో పతకం. 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో అతను స్వర్ణం గెలిచాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌కు గాయంతో దూరమయ్యాడు.

పారిస్ ఒలింపిక్ విజేత, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్.. ఈటెను 77.41 మీటర్ల దూరం మాత్రమే విసిరి 9వ స్థానంలో నిలిచాడు. గ్రెనేడియన్ స్టార్ అండర్సన్ పీటర్స్(83.88), సౌతాఫ్రికా జావెలిన్ త్రోయర్ డౌ స్మిత్(82.88) నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాడు. భారత్‌కు చెందిన రోహిత్ యాదవ్.. ఈటెను 81.56 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలిచాడు.
నీరజ్ సలహాతో పతకం గెలిచిన యశ్వీర్
నీరజ్ చోప్రా ఈటెను తొలి ప్రయత్నంలో 8.97 మీటర్లు మాత్రమే విసరగా.. రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.83 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో 81.29, నాలుగో ప్రయత్నంలో 80.73 మీటర్లు మాత్రమే విసిరి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. దాంతో బంగారు పతకం గెలుస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
తొలి నాలుగు ప్రయత్నాల్లో 81.33 మీటర్లు ధాటలేకపోయిన యశ్వీర్ సింగ్.. నీరజ్ చోప్రా సూచనలతో ఆఖరి ప్రయత్నంలో ఏకంగా 85.41 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రనప్ మార్చుకోవాలని నీరజ్ చోప్రా ఇచ్చిన సలహా అతనికి కలిసొచ్చింది.
నీరజ్ అదరగొట్టావ్..
జావెలిన్ త్రోలో రజతం, సిల్వర్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా, యశ్వీర్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా అభినందించారు. 'గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా అదరగొట్టాడు. సిల్వర్ మెడల్ గెలిచి దేశం గర్వపడేలా చేశాడు. నిలకడ, సంయమనం, స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. కాంస్య పతకం సాధించిన యశ్వీర్‌కు కంగ్రాట్స్. ఆటలపై నీకున్న ఆసక్తి, నిబద్ధతకు ఈ విజయమే నిదర్శనం. యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచావు.'అని మోదీ పోస్ట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

