Commonwealth Games 2026: లవ్‌ప్రీత్ సింగ్‌కు సిల్వర్.. డిస్కస్ త్రోలో సీమకు కాంస్యం!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 8వ రోజు(జూలై 30) భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. భారత వెయిలిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ సిల్వర్ మెడల్ సాధించగా.. డిస్కస్ త్రోయర్ సీమ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దాంతో భారత్ పతకాల సంఖ్య 17కి చేరింది. ఇందులో 3 స్వర్ణాలతో పాటు 10 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
పురుషుల 110 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ 388 కేజీల బరువు ఎత్తి తృటిలో స్వర్ణాన్ని కోల్పోయాడు. స్నాచ్ విభాగంలో 176 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్‌లో నయా రికార్డ్ నమోదు చేశాడు. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 212 కేజీలు ఎత్తాడు. న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ ఆండ్రూ లిట్టి క్లీన్ అండ్ జర్క్‌లో223 కేజీలు సరికొత్త రికార్డుతో మొత్తం 389 కేజీలు ఎత్తి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఒక్క కేజీ తేడాతో గోల్డ్ మొడల్‌ను సొంతం చేసుకున్నాడు.

లవ్‌ప్రీత్ సింగ్ రజతంతో భారత వెయిట్ లిఫ్టింగ్ బృందం ఒక స్వర్ణం, 6 రజతాలు, ఒక కాంస్యంతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల డిస్కస్ త్రోయర్ విభాగంలో సీమ డిస్కస్‌ను 58.65 మీటర్ల దూరం విసిరింది. ఈ ఈవెంట్‌లో జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించింది.
కెనడాకు చెందిన జూలియా డంక్స్ 60.67 మీటర్ల త్రో సాయంతో సిల్వర్ గెలుచుకుంది. మరో భారత ప్లేయర్ నిధిరాణి 57.10 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయింది. గతంలో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న లవ్‌ప్రీత్ సింగ్ ఈ సారి సిల్వర్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో 8వ రోజు నాటికి భారత్ మెడల్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

