Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్‌లో భారత్ శుభారంభం.. పంచ్‌ పడకుండానే పతకం!

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం చేసింది. స్కాంట్లాండ్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి రోజు లాన్ బౌల్స్‌లో విభాగంలో భారత్ రెండు విజయాలు నమోదు చేసింది. పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ విజయం సాధించాడు. 2023 వరల్డ్ ఛాంపియన్, కెనడా ప్లేయర్ ర్యాన్ బెస్టర్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో 5-4తో గెలిచిన పుతుల్.. రెండో సెట్‌ను 3-7తో ఓడిపోయాడు. టైబ్రేక్‌లో రాణించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలపై అంచనాలొద్దు: గోపిచంద్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలపై అంచనాలొద్దు: గోపిచంద్

మహిళల పెయిర్స్ విభాగంలో రూప రాణి టిర్కీ, పింకి సింగ్ జంట తొలి మ్యాచ్‌లో రెబెకా, కానీ లీ(మాల్టా) ద్వయంపై టైబ్రేక్‌లో గెలుపొందింది. తొలి సెట్‌లో 7-1తో గెలిచిన భారత జోడీ.. రెండో సెట్‌లో 3-4తో వెనుకంజలో నిలిచింది. టైబ్రేక్‌లో రూప, పింకి ద్వయం సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో భారత్ ద్వయం సౌతాఫ్రికాతో తలపడనుంది.

Commonwealth Games 2026 Boxer Lovlina Borgohain Opened India s Medal Account 2nd Day India Schedule

పంచ్‌ పడకుండానే పతకం..

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ బరిలోకి దిగకుండానే మెడల్ ఖాయం చేసుకుంది. తొలి రౌండ్‌లో బై లభించడంతో ఆమె నేరుగా సెమీఫైనల్ చేరింది. స్వర్ణంపై గురిపెట్టిన ఆమె.. 75 కేజీల విభాగంలో పోటీపడుతుంది. ఈ విభాగంలో 5 మంది బాక్సర్లే పోటీపడుతున్నారు. బాక్సింగ్ విభాగంలో మరో 8 మందికి తొలి రౌండ్‌లో బై లభించింది. నేడు(శుక్రవారం) బాక్సింగ్ పోటీలు మొదలవ్వనున్నాయి.

IND vs ZIM: బుడ్డోడి విధ్వంసం.. టీమిండియా ఘన విజయం! మలుపు తిప్పిన పేస్ సెన్సేషన్!

IND vs ZIM: బుడ్డోడి విధ్వంసం.. టీమిండియా ఘన విజయం! మలుపు తిప్పిన పేస్ సెన్సేషన్!

మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ జెస్మీన్ లాంబోరియా(57 కేజీలు), ప్రియ ఘంఘాస్(60), ప్రీతి పవార్(54), అరుంధతి(70), సాక్షి చౌదరి(51)లు బరిలోకి దిగుతున్నారు. పురుషుల విభాగంలో జాదుమణి సింగ్(55), ఆదిత్య ప్రతాప్ సింగ్(65), కపిల్ పొకారియా(90), సచిన్ సివాచ్(60), సుమిత్ కుండు(70), అంకుశ్(80), నరేందర్ బెర్వాల్(90) పోటీపడుతున్నారు.


స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్

మధ్యాహ్నం 3:40 PM: పారా స్విమ్మింగ్ - పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ S13 హీట్స్ (ఆర్‌.వి.వి.బి.కె. బుడిగినా)

మధ్యాహ్నం 3:56 PM: స్విమ్మింగ్ - పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్)

అర్ధ రాత్రి 12:00 AM: పారా స్విమ్మింగ్ - 100 మీటర్ల ఫ్రీస్టైల్ S13 ఫైనల్ (అర్హత సాధిస్తే)

అర్థ రాత్రి 12:29 AM: స్విమ్మింగ్ - 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్ (అర్హత సాధిస్తే)

పారా పవర్ లిఫ్టింగ్ (పతకాల ఈవెంట్స్)

సాయంత్రం 5:40 PM: పురుషుల లైట్‌వెయిట్ ఫైనల్ (అశోక్, పర్మ్‌జీత్ కుమార్)

రాత్రి 7:24 PM: మహిళల లైట్‌వెయిట్ ఫైనల్ (జస్ప్రీత్ కౌర్, సుమన్ దేవి)

రాత్రి 10:40 PM: మహిళల హెవీవెయిట్ ఫైనల్ (కస్తూరి రాజమణి)

మధ్యరాత్రి 12:29 AM: పురుషుల హెవీవెయిట్ ఫైనల్ (సుధీర్, ఝాండు కుమార్)

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్

మధ్యాహ్నం 2:30 PM: పురుషుల టీమ్ & ఇండివిజువల్ క్వాలిఫికేషన్ (తపేశ్వర్‌నాథ్ దాస్, స్వాతిష్, తాపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్)

రాత్రి 10:00 PM: పురుషుల టీమ్ ఫైనల్ (అర్హత సాధిస్తే)

లాన్ బౌల్స్ (Lawn Bowls)

రాత్రి 7:30 PM: మహిళల పెయిర్స్ (సెక్షనల్ రౌండ్ 2) - రూపా రాణి తిర్కీ & పింకీ vs సౌత్ ఆఫ్రికా

రాత్రి 10:20 PM: పురుషుల సింగిల్స్ (సెక్షనల్ రౌండ్ 2) - పుతుల్ సోనోవాల్ vs ఫాక్‌లాండ్ ఐలాండ్స్

బాక్సింగ్

రాత్రి 11:00 PM: పురుషుల 55 కేజీల కేటగిరీ (రౌండ్ ఆఫ్ 32) - జాదుమణి సింగ్ vs ఆరోన్ కల్లెన్ (స్కాట్లాండ్)

Story first published: Friday, July 24, 2026, 10:20 [IST]
Other articles published on Jul 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+