24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. ఒకే గ్రూప్‌లో భారత్-పాక్!

దుబాయ్: 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్ వేదికగా జరగిన కామన్‌వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగే టోర్నీలో క్రికెట్ చూడనున్నాం. ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హోమ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. అయితే ఈ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పిస్తున్నామని ఐసీసీ, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి.
ఇప్పటికే ఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మహిళల జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించగా.. తాజాగా శ్రీలంక క్వాలిఫై అయినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

క్రికెట్‌ను విస్తరించేందుకే..
'చాలా రోజుల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్ కోసం తుది జట్లను ఖరారు చేయడం బాగుంది. బంగారు పతకం కోసం 8 జట్లు పోటాపోటీగా తలపడతాయని ఆశిస్తున్నా. మహిళల క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో సీడబ్ల్యూజీ ముఖ్య భూమిక పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు క్రికెట్‌ను మరింత దగ్గరకు చేరువ చేస్తాం. క్రికెట్ అనేది కామన్‌వెల్త్‌కు పర్యాపదంగా ఉండేది. కౌలాలంపూర్‌లో 1998లో వన్డే టోర్నీ తర్వాత మళ్లీ ఇప్పుడు క్రికెట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది'అని సీజీఎఫ్ అధ్యక్షుడు డేమ్ లూయిస్ మార్టిన్ వెల్లడించారు. మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఒకే గ్రూప్‌లో భారత్-పాక్
మహిళల క్రికెట్ తొలిసారి ఆడుతున్న నేపథ్యంలో 8 జట్లను ఐసీసీ రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడటం విశేషం. ఈ రెండు జట్లతో పాటు ఆస్ట్రేలియా, బార్బడోస్ ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక గ్రూప్ బిలో తల పడనున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు అయిన ఆస్ట్రేలియా, భారత్ జూలై 29న తలపడే మ్యాచ్‌తో కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు ప్రారంభం అవుతాయి.

సౌతాఫ్రికా చాంపియన్..
1998లో కౌలాలంపూ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్ వన్డే టోర్నమెంట్ జరిగింది. అప్పుడు మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. షాన్ పొలాక్ సారథ్యంలోని సౌతాఫ్రికా విజేతగా నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టీమిండియా ఓకే విజయం మాత్రమే సాధించి గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. ఈ టోర్నీ ద్వారానే సచిన్ టెండూల్కర్, జాక్వెస్ కలిస్, మహేల జయవర్థనె వంటి ఆటగాళ్లు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications