Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటల్ సర్వర్‌గా ఒలింపిక్ మెడలిస్ట్!(వీడియో)

చైనా జిమ్నాస్ట్ జౌ యాకిన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో రజతం నెగ్గిన తర్వాత పోడియంపై నిల్చొని అమాయకంగా పతకాన్ని ముద్దాడిన వీడియోతో 18 ఏళ్ల జౌ యాకిన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

ఒలింపిక్ మెడల్ సాధించి స్వదేశానికి చేరిన యాకిన్.. తిగిన తన రోజువారీ పనులు మొదలుపెట్టింది. ఓ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిచేస్తూ కనిపించింది.ఒలింపిక్‌ యూనిఫాంలో సర్వ్‌ చేస్తున్న ఆమె వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో గల హెంగ్‌యాంగ్‌ సిటీలో 'ఫ్యాట్‌ బ్రదర్‌' పేరుతో యాకిన్‌ తల్లిదండ్రులకు ఓ రెస్టారెంట్ ఉంది.

Chinese Olympic medallist Zhou Yaqin returns from Paris to working in family restaurant

దాంతో విశ్వక్రీడలు ముగిసిన తర్వాత ఇంటి చేరుకున్న యాకిన్‌ తల్లిదండ్రులకు సహాయంగా కస్టమర్లకు సర్వ్‌ చేస్తోంది. ఇలా.. ఆటను, కుటుంబ బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్‌ చేస్తోన్న యాకిన్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. పారిస్‌ క్రీడల్లో బ్యాలెన్సింగ్‌ బీమ్‌ ఈవెంట్‌లో అమెరికా దిగ్గజం సిమోన్‌ బైల్స్‌ లాంటి వారితో పోటీపడి యాకిన్‌ రెండో స్థానంలో నిలిచింది.

పతక ప్రదానం సందర్భంగా స్వర్ణం, కాంస్యం గెలిచిన ఇటలీ జిమ్నాస్ట్‌లు అలీస్‌ డిమాంటో, మనీలా ఎస్పోసిటోలు పతకాన్ని కొరికి సందడి చేస్తుంటే.. ఆశ్చర్యంగా వారివైపు చూసిన యాకిన్‌, పతక విజేతలు ఇలాగే చేయాలేమో అనుకొని పతకం నోటి దగ్గర పెట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. అప్పట్లో ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది.

18 ఏళ్ల వయసులోనే పారిస్ ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన యాకిన్.. అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే పతకం సాధించింది. ఈ ఈవెంట్‌లో సిమోన్ బైల్స్ ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.

Story first published: Wednesday, August 21, 2024, 8:45 [IST]
Other articles published on Aug 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+