Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనా మారథాన్‌లో పెను విషాదం.. భీకర గాలులకు 21 మంది రన్నర్ల బలి!

China officials Probes Deaths Of 21 Ultramarathon Runners After Freak Weather Hits Race
#TOPNEWS: Congo Volcano Eruption | Oneindia Telugu

బీజింగ్‌: చైనాలో శనివారం జరిగిన మారథాన్‌ పెను విషాదన్ని మిగిల్చింది. భీకర గాలులు.. భారీ వర్షాల ధాటికి 21 మంది రన్నర్లు దుర్మరణం పాలయ్యారు. అల్ట్రా మారథాన్‌లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో అత్యంత క్లిష్టమైనదిగా భావించే 100 కిలో మీటర్ల రేసులో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అథ్లెట్లు ఎల్లో నది స్టోన్‌ అడవి ప్రాంతానికి వచ్చేసరికి అకస్మాత్తుగా భారీ వర్షం, భీకర గాలులు మొదలయ్యాయి. గాలి, వానకు తోడు వడగళ్లు పడడంతో వారంతా చెల్లాచెదురైపోయారు.

ఈ క్రమంలోనే కొందరు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరికొందరి ఆచూకీ గల్లంతైంది. వెంటనే అప్రమత్తమైన నిర్వహకులు.. 1200 మంది బృందంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయానికి చనిపోయిన 21 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. 172 మంది ఈ రేసులో పాల్గొనగా.. 21 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు.

మిగిలిన 151 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. సముద్ర మట్టానికి 6500 అడుగుల పైన ఎత్తులో ఈ రేసును నిర్వహించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, వాతావరణ హెచ్చరికలు తెలుసుకోకుండా నిర్వాహకులు రేసును ఎలా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Story first published: Monday, May 24, 2021, 12:37 [IST]
Other articles published on May 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+