Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chess World Cup final 2023: ప్రజ్ఞానంద జోరు.. డ్రాగా ముగిసిన తొలి గేమ్!

బాకు: చెస్ ప్రపంచకప్ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద తన జోరును కొనసాగిస్తున్నాడు. వరల్డ్ నెంబర్ వన్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో ప్రజ్ఞానంద అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో తొలి గేమ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు 35 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించారు.

రెండో గేమ్ బుధవారం జరగనుంది. ఈ గేమ్‌లో కూడా ఫలితం తేలకుంటే టై బ్రేకర్స్ ద్వారా ఫలితం తేల్చనున్నారు. సోమవారం ముగిసిన సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాను మట్టికరిపించి ఫైనల్ చేరాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.

R Praggnanandhaa

హోరాహోరీగా సాగిన సెమీస్‌లో మొదటి నుంచి అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాకు గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. మొదట తొలి రెండు క్లాసికల్‌ గేమ్‌లు డ్రా కావడంతో పోరు టైబ్రేక్‌కు మళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు.

ఆ తర్వాత గేమ్‌లో తెల్లపావులతో ఆడి 53 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించాడు. దీంతో ర్యాపిడ్‌లో రెండో రౌండ్‌కు తెరలేచింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ప్రజ్ఞానంద ఆధిపత్యం చలాయించాడు. కరువానా నుంచి గట్టి సవాలును దాటుకుని 63 ఎత్తుల్లో విజయం సాధించాడు.

ఈ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రసవత్తరంగా సాగిన గేమ్‌ను 82 ఎత్తుల్లో డ్రా చేసుకుని ముందంజ వేశాడు. ఓవరాల్‌గా సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్‌ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్న ప్రజ్ఞానంద.. బాబి ఫిషర్‌, కార్ల్‌సన్‌ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు.

అంతే కాకుండా 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఫార్మాట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్‌ చేరిన తొలి భారత ఆటగాడు అతనే. అంతకుముందు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగిన ప్రపంచకప్‌ల్లో ఆనంద్‌ 2000, 2002లో టైటిల్‌ నెగ్గాడు.

Story first published: Tuesday, August 22, 2023, 22:32 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+