Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chess World Cup 2023 Final: తొలి గేమ్ గెలిచిన కార్ల్‌‌సన్.. ఒత్తిడిలో ప్రజ్ఞానంద!

బాకు: అత్యంత ఆసక్తి రేపుతూ.. ఉత్కంఠభరితంగా సాగుతున్న చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మరో మలుపు తీసుకుంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన ట్రై బ్రేక‌ర్‌ తొలి రౌండ్ ఫస్ట్ గేమ్‌లో కార్లసన్ విజయం సాధించాడు. ప్రజ్ఞానంద చేసిన అనవసర తప్పిదం కార్ల్‌సన్‌కు కలిసొచ్చింది. 47 ఎత్తుల అనంతరం కార్ల్‌సన్‌ విజయాన్నందుకున్నాడు.

తొలి గేమ్ గెలవడంతో ప్రజ్ఞానందకు చావో రేవో పరిస్థితి ఏర్పడింది. రెండో ట్రై బ్రేకర్ గేమ్‌లో విజయం సాధిస్తేనే 18 ఏళ్ల ప్రజ్ఞానంద‌కు విజయవకాశాలు ఉంటాయి. ఓడితే మాత్రం కార్ల్‌సన్ టైటిల్ ఎగరేసుకుపోతాడు. కీలక రెండో గేమ్ కూడా ప్రారంభమైంది.

టైబ్రేక్‌ నిబంధన ప్రకారం మొదట ర్యాపిడ్‌లో పోటీ జరుపుతారు. రౌండ్‌కు రెండు గేమ్‌లు చొప్పున రెండు రౌండ్లు పోటీ ఉంటుంది. తొలి రౌండ్లో ఫలితం వస్తే అక్కడితో పోటీ ఆపేసి విజేతను ప్రకటిస్తారు. ర్యాపిడ్‌ రౌండ్లు ముగిసినా ఆటగాళ్ల పాయింట్లు సమానంగా ఉంటే.. అప్పుడు ఒక్కో రౌండ్‌కు రెండు చొప్పున బ్లిట్జ్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. రెండు రౌండ్లలో ఫలితం తేలకపోతే.. ఎవరో ఒకరు విజేతగా నిలిచేంతవరకూ బ్లిట్జ్‌ గేమ్‌లు కొనసాగిస్తారు.

Magnus Carlsen beats India’s Praggnanandhaa

తొలి రౌండ్‌ తొలి గేమ్‌లో కార్ల్‌సన్‌కు విజయం దక్కడంతో ప్రజ్ఞానంద తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. రెండో గేమ్‌ను గెలవడం అతనికి కీలకం. డ్రా అయినా కార్ల్‌సన్‌కే విజయం దక్కనుంది.

నాకౌట్ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో తొలి రెండు గేమ్స్ డ్రా అయ్యాయి. దాంతో టై బ్రేక్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రెండో గేమ్‌‌లో తెల్ల పావులతో ఆడిన ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ మొదటి నుంచి డ్రా దృష్టిలో పెట్టుకునే ఆడాడు. మరోవైపు నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా పావులు కదిపాడు. సెమీస్‌ తర్వాత కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం బారిన పడ్డానని చెప్పిన కార్ల్‌సన్‌.. పోరును టైబ్రేక్‌కు మళ్లించేందుకే ప్రయత్నించాడు.

మరో రోజు ఆగితే మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడొచ్చన్నది అతని ఆలోచనగా అర్థమైంది. ప్రజ్ఞానంద కూడా రక్షణాత్మకంగానే ఆడాడు. దీంతో 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు ఒప్పుకున్నారు. రెండు క్లాసికల్‌ గేమ్‌లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్‌సన్‌ 1-1తో సమానంగా ఉన్నారు.

Story first published: Thursday, August 24, 2023, 17:02 [IST]
Other articles published on Aug 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+