Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chess World Cup 2023 Final: ప్చ్.. ప్రజ్ఞానంద ఓటమి!

బాకు: అత్యంత ఆసక్తిగా సాగిన చెస్ ప్రపంచకప్ ఫైనల్లో భారత కుర్రాడు ప్రజ్ఞానందకు ఓటమి ఎదురైంది. అసాధారణ ప్రదర్శనతో 18 ఏళ్ల వయసులోనే ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద టైటిల్ పోరులో మాత్రం జోరు కొనసాగించలేకపోయాడు. వరల్డ్ నెంబర్ వన్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) ఎత్తులకు చిత్తయ్యాడు. టై బ్రేక్‌కు దారితీసిన ఫైనల్లో రెండు గేమ్‌ల్లో జోరు కనబర్చిన కార్ల్‌సన్.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

గురువారం జరిగిన టై బ్రేక్ గేమ్‌లో కార్ల్‌సన్ 1.5 స్కోర్‌తో విజయం సాధించగా.. ప్రజ్ఞానంద 0.5 స్కోర్‌కే పరిమితమయ్యాడు. తొలి టై బ్రేక్ గేమ్‌లో 47 ఎత్తుల్లో చిత్తయిన ప్రజ్ఞానంద.. రెండో టై బ్రేక్ గేమ్‌ను 21 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. దాంతో కార్ల్‌సన్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను అందుకున్నాడు.

విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు రూ. 91 లక్షల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు రూ.61 లక్షల క్యాష్ రివార్డ్ లభించింది.

Carlsen beats Praggnanandhaa in tie-breaks to win the title

నాకౌట్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగ్గా.. ఫైనల్లో తొలి రెండు గేమ్స్ డ్రా అయ్యాయి. దాంతో టై బ్రేక్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రెండో గేమ్‌‌లో తెల్ల పావులతో ఆడిన ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ మొదటి నుంచి డ్రా దృష్టిలో పెట్టుకునే ఆడాడు. మరోవైపు నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా పావులు కదిపాడు. సెమీస్‌ తర్వాత కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం బారిన పడ్డానని చెప్పిన కార్ల్‌సన్‌.. పోరును టైబ్రేక్‌కు మళ్లించేందుకే ప్రయత్నించాడు.

మరో రోజు ఆగితే మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడొచ్చన్నది అతని ఆలోచనగా అర్థమైంది. ప్రజ్ఞానంద కూడా రక్షణాత్మకంగానే ఆడాడు. దీంతో 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు ఒప్పుకున్నారు. రెండు క్లాసికల్‌ గేమ్‌లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్‌సన్‌ 1-1తో సమానంగా నిలిచారు.

టై బ్రేక్ గేమ్‌లో ఉత్సాహంగా కనిపించిన కార్ల్‌సన్ తన అనుభవంతో ప్రజ్ఞానందను మట్టికరిపించాడు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానందను ఓడించి ఒత్తిడిలోకి నెట్టిన కార్ల్‌సన్.. రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 21 ఎత్తుల తర్వాత గేమ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. దాంతో కార్ల్‌సన్ విజయం లాంఛనమైంది.

Story first published: Thursday, August 24, 2023, 17:27 [IST]
Other articles published on Aug 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+