Chess Olympiad నేటి నుంచే షురూ! కింగ్.. క్వీన్ ఎవరో?

చెన్నై: ఓవైపు కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటే.. మరోవైపు భారత్‌లో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ జోష్ తారా స్థాయికి చేరుకుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తుండటంతో యావత్ దేశం టోర్నీపై ఎనలేని ఆసక్తికనబరుస్తోంది. రష్యాపై వేటు పడడంతో అనూహ్యంగా ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకున్న భారత్.. పోటీల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొనే టోర్నీలో ఓపెన్, మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్ ఆరు జట్లను బరిలోకి దించుతోంది.
తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. రష్యా, చైనా బరిలో లేకపోవడంతో స్వర్ణానికి అమెరికా బలమైన పోటీదారుగా మారింది. భారత్‌కు పసిడి రేసులో పెద్ద అడ్డంకి ఆ జట్టే. ప్రపంచ ఛాంప్ కార్ల్‌సన్ నార్వే జట్టుకు ఆడుతున్నాడు. అతను టోర్నీకే ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. ఈసారి పోటీలకు దూరంగా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్.. భారత జట్లకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. రాత్రి 7 గంటల నుంచి ఈ టోర్నీ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

స్వీస్ లీగ్ ఫార్మాట్‌లో..
మ్యాచ్‌లన్నీ స్వీస్ లీగ్ ఫార్మాట్‌లోనే జరుగుతాయి. మొత్తం 11 రౌండ్లుంటాయి. ప్రతి రౌండ్లో ఒక జట్టు తరఫున నలుగురు క్రీడాకారులు ప్రత్యర్థి జట్టులోని నలుగురితో తలపడతారు. గేమ్ వ్యవధి 90 నిమిషాలు. అందులో 40 ఎత్తులు వేయాలి. నిర్ణీత వ్యవధిలో ఫలితం తేలకుంటే అదనంగా 30 నిమిషాలు ఇస్తారు. 11వ రౌండ్ అయ్యేసరికి జట్ల మధ్య పాయింట్లు సమానమైతే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఆగస్టు 4 రెస్ట్ డే, ఓపెన్, మహిళల సెక్సన్స్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ఇస్తారు. మ్యాచ్‌లన్నీ చెన్నై 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురంలోని షెరటాన్ రిసార్ట్‌లో మధ్యాహ్నం 3 నుంచి మొదలవుతాయి.

బరిలో ఉన్న భారత జట్లు
ఓపెన్ విభాగం
ఎ: పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతి, అర్జున్ ఎరిగైసి, నారాయణన్, శశికిరణ్.
బి: నిహాల్ సరీన్, గుకేశ్, ప్రజ్ఞానానంద, అధిబన్, రౌనక్ సద్వాని.
సి: సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, కార్తికేయన్ మురళి, అభిమన్యు పురాణిక్.
మహిళల విభాగం
ఎ: కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణి.
బి: వంతిక అగర్వాల్, సౌమ్య స్వామినాథన్, మేరీఆన్ గోమ్స్, పద్మిని రౌత్, దివ్య దేశ్‌ముఖ్.
సి: ఈషా కర్వాడే, సాహితి వర్షిణి, ప్రత్యూష బొడ్డ, పీవీ నందిద, విశ్వ వస్నవాలా.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
చెస్ ఒలింపియాడ్ జ్యోతి.. ఆతిథ్య నగరం చెన్నైకి చేరుకుంది. చెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ తరహాలో తొలిసారి ఒలింపియాడ్ కోసమే జ్యోతి రిలేను ఈ ఏడాదే ప్రారంభించారు. జూన్ 19న దిల్లీలో ప్రధాని మోదీ ఈ రిలేను ప్రారంభించారు. జ్యోతిని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌కు అందించారు. ఈ రిలే దేశంలోని 75 నగరాల్లో సాగింది. రిలే సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో చెస్ పోటీలు నిర్వహించి అందులో టాప్-3లో నిలిచిన వారిని చెస్ ఒలింపియాడ్‌కు అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. జ్యోతిని తిరిగి అందుకున్న ఆనంద్.. గురువారం ఒలింపియాడ్ ప్రారంభ వేడుకలో ప్రధాని మోదీకి అందించనున్నాడు.

ఒలింపియాడ్‌లో భారత్
చెస్ ఒలింపియాడ్‌లో ఒకప్పుడు భారత్ నుంచి పతకం ఆశించే పరిస్థితే ఉండేది కాదు. కానీ గత దశాబ్ద కాలంలో కథ మారింది. 2014లో తొలిసారి భారత్ కాంస్యం గెలిచింది.ఇక కరోనా కారణంగా ఆన్‌లైన్లో జరిగిన గత రెండు టోర్నీల్లోనూ భారత్ అదరగొట్టింది. 2020లో రష్యాతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన భారత్.. గత ఏడాది కాంస్యం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications