Chess Olympiad: అదరగొట్టిన మాస్టర్లు.. భారత్‌కు రెండు పతకాలు!

చెన్నై: భారత అథ్లెట్లు సూపర్ పెర్ఫామెన్స్‌తో కామన్వెల్త్ గేమ్స్‌ను ముగించిన తర్వాతి రోజే చెస్ గ్రాండ్ మాస్టర్స్ తన ఎత్తులతో అదరగొట్టారు. చదరంగంలో అత్యుత్తమ టోర్నీ అయిన చెస్ ఒలింపియాడ్‌లో పతకాల మోత మోగించారు. భారత్‌తో తొలి ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా ఈవెంట్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికతో కూడిన జట్టు బ్రాంజ్ మెడల్‌తో చరిత్ర సృష్టించింది. ఒలింపియాడ్‌లో మహిళల జట్టుకు ఇదే తొలి పతకం. మరోవైపు ఓపెన్ సెక్షన్‌లో యువ గ్రాండ్ మాస్టర్స్‌తో కూడిన భారత్-బి జట్టు కూడా సిల్వర్ గెలిచింది.
ఓపెన్, మహిళల విభాగంలో సంయుక్తంగా బెస్ట్ పెర్ఫామెన్స్‌కుగాను భారత్-ఏ ప్రతిష్టాత్మక గఫ్రిందాష్విలి ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సమయంలో వ్యక్తిగత మెడల్స్‌లో యంగస్టర్స్ రెండు గోల్డ్ సహా ఏడు పతకాలు కైవసం చేసుకొని శభాష్ అనిపించారు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ సిల్వర్‌తో మెరిశాడు.

ఆఖరి రౌండ్‌లో ఓటమి..
పదో రౌండ్ వరకు అగ్రస్థానంలో ఉన్న భారత మహిళల-ఏ జట్టు మంగళవారం, చివరిదైన 11వ రౌండ్లో 1-3తో అమెరికా చేతిలో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. తొఖిర్‌జొనోవాతో గేమ్‌ను హంపి, ఇరినా కృష్‌తో గేమ్‌ను వైశాలి డ్రాగా ముగించారు. కరీసా ఇప్ చేతిలో తానియా, అబ్రహమ్యాన్ చేతిలో భక్తి కులకర్ణి ఓడిపోవడం భారత్‌ను దెబ్బతీసింది.

మూడో స్థానంలో భారత్- బీ
మరోవైపు వంతిక, పద్మిని రౌత్, మేరీ ఆన్ గోమ్స్, దివ్యలతో కూడిన భారత్-బీ ఎనిమిదో స్థానం సాధించగా.. భారత్-సీ (ఈషా, నందిద, సాహితి, ప్రత్యూష) 17వ స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్ స్వర్ణం గెలుచుకుంది. ఆఖరి రౌండ్లో ఆ జట్టు 3-1తో పోలెండ్‌పై విజయం సాధించింది. జార్జియా రజతం గెలుచుకుంది. ఓపెన్ విభాగంలో భారత్-బీ మూడో స్థానంలో నిలిచింది. గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, రౌనక్ సధ్వానిలతో కూడి ఈ జట్టు ఆఖరి రౌండ్లో 3-1తో జర్మనీపై విజయం సాధించింది.

రెండు స్వర్ణాలు..
లివ్యూ డైటర్‌పై రౌనక్, మతియాస్‌పై నిహాల్ నెగ్గగా.. విన్సెంట్తో గేమ్‌ను గుకేశ్, రాస్మస్‌తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించారు. అమెరికాతో తమ చివరి రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించిన భారత్-ఏ (హరికృష్ణ, విదిత్, అర్జున్ నారాయణన్).. నాలుగో స్థానంలో నిలిచింది. భారత్-సీ జట్టు 31వ స్థానం సాధించింది.
ఉజ్బెకిస్థాన్ స్వర్ణం ఎగరేసుకుపోయింది. బలమైన అర్మేనియా జట్టును రజతానికి పరిమితం చేసింది. చెస్ ఒలింయాడ్‌లో భారత్ 2014లో తొలిసారి పతకం (ఓపెన్‌లో కాంస్యం) గెలుచుకుంది. వ్యక్తిగత ప్రదర్శనలకుగాను గుకేశ్, సరీన్ స్వర్ణాలు.. అర్జున్ రజతం గెలుచుకున్నారు. ప్రజ్ఞానంద, వైశాలి, తానియా, దివ్య కాంస్యాలు సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications