Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ఖేల్‌రత్న’కు అమిత్‌, వికాస్‌

BFI nominates Amit Panghal, Vikas Krishan for Khel Ratna

న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్‌షిప్‌ సిల్వర్ మెడలిస్ట్ అమిత్‌ పంగల్‌తో పాటు వెటరన్‌ స్టార్‌ వికాస్‌ క్రిషన్‌ను ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) సిఫారసు చేసింది. ఇక.. వరల్డ్ బ్రాంజ్ విన్నర్స్ మనీష్‌ కౌశిక్‌ (63 కి)తో పాటు మహిళా బాక్సర్లు లవ్లీనా బొర్గోహైన్‌ (69 కి), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కి)ను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది.

కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న 24 ఏళ్ల అమిత్‌ ఫంగల్‌ (52 కి), కామన్వెల్త్‌, ఆసియా క్రీడల చాంపియన్‌ అయిన 28 ఏళ్ల వికాస్‌ (69 కి) ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే వీరు కచ్చితంగా అత్యున్నత అవార్డుకు అర్హులని భావించే నామినేట్‌ చేశామని బీఎ్‌ఫఐ తెలిపింది. అత్యున్నత పురస్కారం కోసం ఒలింపిక్ బౌండ్ బాక్సర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఆసియా గేమ్స్ చాంపియన్ కూడా అయిన అమిత్‌కు ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా రాలేదు. గత మూడేళ్లుగా అర్జునకు నామినేట్ చేసినా.. 2012 డోప్ కేసు కారణంగా సెలెక్షన్ కమిటీ పక్కన బెడుతూ వచ్చింది. ఇక 2012లో వికాస్‌కు అర్జున పురస్కారం లభించింది.

మహిళల కోచ్‌ మహ్మద్‌ అలీ ఖమర్‌, అసిస్టెంట్‌ కోచ్‌ చోటేలాల్‌ యాదవ్‌ను ద్రోణాచార్య అవార్డుకు.. ప్రపంచ చాంపియన్‌షిప్‌ మాజీ పతక విజేత ఎన్‌.ఉష పేర్లను ధ్యాన్‌చంద్‌ జీవితకాల పురస్కారం కోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు పంపామని బీఎఫ్ఐ ప్రకటించింది.

Story first published: Tuesday, June 2, 2020, 9:49 [IST]
Other articles published on Jun 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+