Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిక్కుల్లో బజరంగ్ పూనియా.. భారత జెండాను తొక్కిన వెటరన్ రెజ్లర్!(వీడియో)

భారత రెజ్లర్ బజరంగ్ పూనియా చిక్కుల్లో పడ్డాడు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌‌కు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన బజరంగ్ పూనియా.. భారత త్రివర్ణ పతకం ఉన్న పోస్టర్‌ను తొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. బజరంగ్ పూనియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు‌కు గురైన వినేష్ ఫోగట్‌కు న్యాయ పోరాటంలోనూ నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకుంది. కానీ తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది. దాంతో ఆమెకు ఏ పతకం రాకుండా పోయింది.

Bajrang Punia Criticised Heavily After He Spotted Standing On Tiranga Poster Video Goes Viral

తుది పోరుకు అర్హత సాధంచే క్రమంలో తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, సంయుక్త రజత పతకం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)‌‌ను వినేష్ ఫోగట్ ఆశ్రయించింది. ఈ న్యాయపోరాటంలోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. వినేష్ ఫోగట్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ బుధవారం(ఆగస్ట్ 16)న తీర్పునిచ్చారు. దాంతో పతక ఆశలు ఆవిరయ్యాయి.

శనివారం స్వదేశం చేరకున్న వినేష్ ఫోగట్ ఘన స్వాగతం లభించింది. పతకం లేకుండా వచ్చినా.. ఆమెకు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, సహచర రెజ్లర్లు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సహచర రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు కూడా ఆమెకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ఓపెన్ టాప్ కారులో వినేష్ ఫోగట్ అభివాదం చేస్తూ ముందుకు కదిలింది. అయితే ఆమెతో మాట్లాడేందుకు మీడియా చుట్టుముట్టారు. దాంతో వాహనం ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొనగా.. బజరంగ్ పూనియా ముందుకు వచ్చి వారిని తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను చూసుకోకుండా కారుపై ఉన్న భారత త్రివర్ణ పతాకం స్టిక్కర్స్‌ను తొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత పతకాన్ని గౌరవించాలనే సోయి కూడా లేదని మండిపడుతున్నారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.

Story first published: Saturday, August 17, 2024, 14:59 [IST]
Other articles published on Aug 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+