
కండోమ్‌తో ప్రయోగం
వివరాల్లోకి వెళితే... ఒలింపిక్స్ లాంటి గేమ్స్‌లో అథ్లెట్లకు కండోమ్‌లు ఇవ్వడం సాధారణం. సురక్షిత శృంగారం చేయాలన్న ఉద్దేశంతో ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లో నిర్వాహకులు అథ్లెట్లకు కండోమ్‌లను ఫ్రీగా ఇస్తారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన స్లాలోమ్ కనోయిస్ట్ జెస్సికా ఫాక్స్ మాత్రం ఆ కండోమ్‌లను ప్రయోగానికి ఉపయోగించింది. తన కయాక్ (చిన్న పడవ)ను రిపేర్ చేయడానికి కండోమ్‌ను ఉపయోగించింది. తన కయాక్‌కు చివరలో ఒక చిన్న రంద్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో కాస్త కార్బన్ మిశ్రమాన్ని పెట్టి.. దాన్ని కండోమ్‌తో పూడ్చివేసింది.

సూపర్ ఐడియా
కండోమ్‌తో రిపేర్ చేసిన కయాక్‌ను ఉపయోగించి బరిలోకి దిగిన జెస్సికా ఫాక్స్.. ఏకంగా రెండు మెడల్స్ గెలుచుకుంది. వుమెన్స్ సీ1 కానో సాలోమ్‌లో స్వర్ణం.. కానో సాలోమ్ కె1 ఫైనల్‌లో ఫాక్స్ క్యాంస్యం గెలుచుకుంది. అలా కండోమ్‌ను తన కయాక్‌కు ఉపయోగించిన జెస్సికా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. కయాక్‌కు కండోమ్‌ను ఉపయోగించిన విధానానికి సంబంధించిన వీడియోనూ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు 'శభాష్', 'గ్రేట్ వర్క్', 'సూపర్ ఐడియా', 'ఇలాంటి ప్రయోగం నేనెప్పుడూ చూడలే' అంటూ జెస్సికాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
IND vs SL: శ్రీలంక పర్యటన సక్సెస్.. టీమిండియా ఫుల్ టైమ్ కోచింగ్‌పై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?

సంతోషంగా ఉంది
పథకాలు గెలిచిన అనంతరం జెస్సికా ఫాక్స్ మాట్లాడుతూ... 'జపాన్ అందంగా ఉంది. టోక్యో అద్భుతమైన వేదిక. కానీ చాలా వేడిగా ఉంది. నీరు కూడా చాలా వెచ్చగా ఉన్నాయి. ఐస్ బాత్‌లు మరియు ఐస్ టవల్స్ అవసరం. ఆస్ట్రేలియాలోని పెన్రిత్‌లో చాలా వెచ్చగా ఉంటుంది. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువగా ఉంది' అని తెలిపింది. కండోమ్‌తో రిపేర్ చేసిన కయాక్‌తో రెండు మెడల్స్ గెలవడం సంతోషంగా ఉందని జెస్సికా చెప్పింది.
క్రీడా గ్రామంలో వాడొద్దు
ఒలింపిక్స్ కోసం వచ్చే అథ్లెట్లకు నిర్వాహకులు కండోమ్‌లు అందజేయడం షరామామూలే. అయితే ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో నిర్వాహకులు ఇలాంటి ఆలోచన ఏమీ చేయరనే అంతా అనుకున్నారంతా. కానీ ఈసారి కూడా అథ్లెట్లకు నిర్వాహకుల నుంచి కండోమ్‌లు అందాయి. కాకపోతే క్రీడా గ్రామంలో వాటిని క్రీడాకారులు ఉపయోగించొద్దని, వాటిని జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లాలని నిర్వాహకులు కండిషన్ పెట్టారు.


Click it and Unblock the Notifications












