Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రేసింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనుంది: పోర్న్‌ స్టార్‌గా మారిన మహిళా రేసర్‌!

Australia Supercar driver-turned porn star Renee Gracie wants to make motorsports return

సిడ్నీ: ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పోర్న్‌ స్టార్‌గా మారిన ఆస్ట్రేలియా మహిళా రేసర్‌ రెనీ గ్రేసీ.. మళ్లీ రేసింగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనుందని తెలిపింది. ఎలాంటి స్పాన్సర్ షిప్ సాయం లేకుండానే మోటార్ స్పోర్ట్స్ బరిలోకి దిగే సామర్థ్యం, సంపద తనకు ఉన్నాయంది. అయితే ప్రజలు తన రాకను స్వాగితిస్తారా? లేదా? అనేది తన అనుమానమని, అయినా దాని గురించి ఆలోచించడం అనవసరమని చెప్పుకొచ్చింది. తాను ఏది చేసిన తన సరదా, సంతోషం కోసమే చేస్తానని తెలిపింది. 'నా రీఎంట్రీని స్వాగతిస్తారని ఏమాత్రం అనుకోవడం లేదు. దాని గురించి ఆలోచించి ఒత్తిడికి గురవ్వడం తప్పా.. నాకు వచ్చేదేం ఉండదు. నా సరదా, ఎంజాయ్ కోసం నేను ఏదైనా చేస్తా. నేను రేసింగ్‌ను వదిలినా ప్రతీరోజు చూస్తూ అప్‌డేట్ అవుతూనే ఉన్నా. ఎందుకంటే రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం'అని రెనీ గ్రేసీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కష్టాల నుంచి గట్టెక్కడానికి..

కష్టాల నుంచి గట్టెక్కడానికి..

14వ ఏట నుంచే రేసర్‌గా కొనసాగుతున్న రెనీ.. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు రేసింగ్‌ వదలి పోర్న్‌ స్టార్‌గా మారింది. ఈ విషయాన్ని ఆమె ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపి వార్తల్లో నిలిచింది. 1998 నుంచి పూర్తి స్థాయి తొలి మహిళా సూపర్ ‌కార్స్‌ రేసర్‌గానూ పేరు తెచ్చుకున్న రెనీకి 2017 నుంచి కష్టాలు మొదలయ్యాయి. రేసింగ్‌లో తన ప్రదర్శన దిగజారడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు కూడా లేకపోవడంతో ఆమె కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం ఓ కారు యార్డులో పనిచేసిన ఆమె.. పరిస్థితులు అనుకూలించక చివరకు పోర్న్‌ స్టార్‌గా మారింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే అడల్ట్‌ స్టార్‌గా మారానని ఈ ఆస్ట్రేలియా రేసర్ తెలిపింది.

30 ఏళ్ల ఈఎంఐ ఏడాదిలోనే పూర్తి..

30 ఏళ్ల ఈఎంఐ ఏడాదిలోనే పూర్తి..

ఓసారి ఓన్లీఫ్యాన్స్‌ అనే అడల్ట్‌ వెబ్‌సైట్‌ చూశాక తనకు ఈ కొత్త కెరీర్‌ ఆలోచన వచ్చిందని రెనీ గ్రేసీ తెలిపింది. ‘ఆ పోర్న్ వెబ్‌సైట్‌లో నా నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంతో తొలి వారంలోనే రెండున్నర లక్షల రూపాయలు సంపాదించా. అడల్డ్ స్టార్‌గా మారడం నా జీవితంలో చేసిన మంచి పని. 30 ఏళ్ల ఇంటి రుణాన్ని (ఈఎంఐ) ఏడాదిలోనే చెల్లించగలిగాను.'అని గ్రేసీ గర్వంగా తెలిపింది. అయితే గ్రేసీ నిర్ణయంతో వి8 సూపర్ కార్స్‌ అభిమానులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

మా నాన్నే సపోర్ట్ చేశాడు..

మా నాన్నే సపోర్ట్ చేశాడు..

ఇక ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తాను ఎంచుకున్న ఈ దారికి తన కుటుంబ సభ్యులు మద్దుతుగా నిలిచారని రెనీ చెప్పుకొచ్చింది. తన తండ్రి దగ్గరుండి ప్రోత్సహించాడని డైలీ టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.‘నేను చెప్పేది నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. నేను చేసే ఈ పనికి మా నాన్న ఎంతో అండగా నిలిచారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించినందకు చాలా గర్వంగా ఫీలయ్యారు.'అని ఈ ఆస్ట్రేలియా మాజీ సూపర్ కార్ డ్రైవర్ చెప్పింది.

భారత అభిమానులపై ఫైర్..

భారత అభిమానులపై ఫైర్..

ఇక ఈ పోర్న్ స్టార్ కమ్ రేసర్ ఆ మధ్య భారత నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన అనుమతి లేకుండా తన ఫొటోలను, ఇతరత్రా వివరాలను దొంగిలించి ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని ఓ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అది కాపీరైట్‌ ఉన్న కంటెంట్‌. వాటిపై నాకే సర్వహక్కులున్నాయి. నా మీద సోషల్ మీడియాలో పేజీలు క్రియేట్‌ చేయడం ఆపండి. వీడియోలు, ఫొటోలను చట్ట వ్యతిరేకంగా షేర్‌ చేయడం మానండి. భారతీయులను నేను ఇష్టపడడం లేదు. నా పేజీ నుంచి వెళ్లిపోండి. మీకు ఎవరూ ఆహ్వానం పలకడం లేదు. మిమ్మల్నందరినీ నా పేజీ నుంచి తొలగిస్తున్నా.' అని 25 ఏళ్ల గ్రేసర్‌ నిప్పులు చెరిగింది.

సరిగ్గా బ్యాటింగ్, బౌలింగ్ చేయలేని అఫ్రిదిని ఎంపిక చేసి ఘోర తప్పిదం చేశారు: అమీర్ సోహైల్

Story first published: Thursday, July 23, 2020, 17:46 [IST]
Other articles published on Jul 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+