Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Athlete of the Year 2023 అవార్డ్ రేసులో గోల్డెన్ భాయ్.. ఓటేసి గెలిపించండి!

న్యూఢిల్లీ: భారత గోల్డెన్ బాయ్, బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఉన్న గొప్ప మెడల్స్‌తో పాటు రికార్డులను అందుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా అథ్లెటిక్స్‌లోనే గొప్ప అవార్డు‌గా భావించే.. అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 రేసులో నిలిచాడు.

ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకాన్ని అందుకున్నాడు. డైమండ్ లీగ్స్‌లోనూ బంగారు పతకంతో మెరిసాడు. ఈ ప్రదర్శనతో జావెలిన్ త్రో పురుషుల ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1‌గా నిలిచిన నీరజ్ చోప్రా.. మరో 10 అథ్లెట్లతో కలిసి అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కోసం పోటీబడుతున్నాడు.

Athlete of the Year 2023: Neeraj Chopra has been nominated by World Athletics

అమెరికా షార్ట్‌పుట్ క్రీడాకారుడు రియా క్రౌజర్, స్వీడెన్ పోల్ వాల్ట్ అథ్లెట్ మొండో డుప్లెంటీస్, అమెరికా 100 మీటర్ల స్పింటర్ నోవా లెలీస్, స్పెయిన్ రేస్ వాకర్ అల్వారో మార్టిన్, గ్రీస్ లాంగ్ జంపర్ మిల్టిడిస్ టెంటో‌గ్లూ, నార్వే 400 హడ్లర్ అథ్లెట్ కర్‌స్టన్ వార్హోమ్, మారిషస్ 3000మీటర్ల స్టీపెల్‌ఛేజ్ వాకర్ సోఫిన్ ఎ బెక్కలీ, నార్వే 15000 మీటర్ల వాకర్ జాకబ్ ఇంగె‌బ్రిడ్జటన్, కెన్యా మారథన్ రన్నర్ కెల్విన్ కింప్టమ్, కెనడా డెకథ్లాన్ అథ్లెట్ పెర్రీ లాపెజ్‌లు కూడా ఈ అవార్డు రేసులో నిలిచారు.

ఈ 10 మంది నుంచి 3 రకాల పద్దతుల్లో ఓటింగ్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈమెయిల్స్ ద్వారా ఓటు వేయడంతో పాటు వరల్డ్ అథ్లెట్లిక్స్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వచ్చే లైక్స్‌ను కూడా ఓట్లుగా పరిగణిస్తారు.
ఇలా వచ్చిన ఓట్లను 50 శాతంగా తీసుకుంటారు. అలాగే వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ ఓట్లతో పాటు పబ్లిక్ ఓట్లను కలిపి ఫైనల్ రిజల్ట్ వెల్లడిస్తారు.

భారత్ నుంచి 2020లో మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, 2021లో పురుషుల హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నారు.

https://twitter.com/WorldAthletics/status/1712437972291711350 ట్వీట్‌ను రీట్వీట్ చేయడం ద్వారా.. https://www.facebook.com/WorldAthletics ఫేస్‌బుక్ పేజీలో లైక్ చేయడం ద్వారా నీరజ్ చోప్రాకు ఓటు వేయచ్చు.

Story first published: Thursday, October 12, 2023, 21:44 [IST]
Other articles published on Oct 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+