Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్!

భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో గోల్ట్ మెడల్ గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. ఉజ్బెకిస్థాన్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ బంగారు పతకం సాధించింది.

మొత్తం 8 మంది జిమ్నాస్ట్‌లు ఫైనల్ చేరగా.. అసాధారణ ప్రదర్శనతో దీపా కర్మాకర్ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. చివరిసారిగా 2015లో ఇదే టోర్నీలో కాంస్య పతకాన్ని అందుకున్న దీపా కర్మాకర్.. తాజా ఎడిషన్‌లో అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటింది.

Asian Gymnastics Championships 2024 Dipa Karmakar becomes first ever Indian gymnast to win gold medal

30 ఏళ్ల కర్మాకర్ ఫైనల్లో 13.566 సగటును నమోదు చేసింది. నార్త్ కోరియాకు చెందిన కిమ్ సన్ హ్యాంగ్(13.466), జో క్యోంగ్(12.966) రజత, కాంస్య పతకాలు అందుకున్నారు.

2016 రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని అందుకుంది. నిషేధిత ఉత్ప్రేరకం తీసుకుందనే కారణంతో దీపా కర్మాకర్‌పై 21 నెలల నిషేధం పడింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన దీపా కర్మాకర్.. ఫస్ట్ టోర్నీలో పసిడితో మెరిసింది.

ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ గెలిచిన పతకాలు

దీపా కర్మాకర్- వ్యక్తిగత వాల్ట్ విభాగం(2015)- కాంస్యం

ప్రణతి నాయక్- వ్యక్తిగత వాల్ట్ విభాగం(2019)-కాంస్యం

ప్రణతి నాయక్- వ్యక్తిగత వాల్ట్ విభాగం(2022)-కాంస్యం

దీపా కర్మాకర్- వ్యక్తిగత వాల్ట్ విభాగం(2024)- గోల్డ్ మెడల్

Story first published: Sunday, May 26, 2024, 20:12 [IST]
Other articles published on May 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+