Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: అందుకే ఆ ఐదుగురు టెన్నిస్ ప్లేయర్లను తప్పించాం: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నీ నుంచి ఐదుగురు టెన్నిస్ ఆటగాళ్లను తప్పించడం వివాదాస్పదమైంది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) పంపిన 12 మంది ఆటగాళ్ల జాబితా నుంచి ఐదుగురు ఆటగాళ్లను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తొలగించింది. కేవలం ఏడుగురికి మాత్రమే అనుమతిచ్చింది.

భారత నంబర్ వన్ సింగిల్స్ ప్లేయర్ సహజ యమలపల్లి, వైష్ణవి అడ్కర్‌‌తో పాటు వైదేహి చౌదరి, మానస్ ధామ్నే, ప్రార్థన తోంబారేలను ఏషియన్ గేమ్స్‌ టెన్నిస్ టీమ్ నుంచి ఐఓఏ తప్పించింది. అయితే ఈ ఐదుగురిని తప్పించడం‌పై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దాంతో ఈ నిర్ణయం వెనుక ఉన్న గల కారణాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు మైఖేల్‌కు వెల్లడించాయి.

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. అఫ్గాన్‌తో భారత టీ20 సిరీస్ ఖరారు!

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. అఫ్గాన్‌తో భారత టీ20 సిరీస్ ఖరారు!

అందుకే తప్పించాం..

ఆసియా క్రీడల్లో పతకాలు సాధించే అవకాశం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని, సింగిల్స్‌లో ఆసియాలో టాప్-6, డబుల్స్‌లో టాప్-8 లోపు ర్యాంక్ ఉన్నవారినే ఎంపిక చేశామని తెలిపాయి. ఆసియా క్రీడలను కేవలం అనుభవం పెంచుకునే టోర్నీలుగా పరిగణించలేమని, ఇది పతకాలు సాధించే వేదికని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

Asian Games 2026 Why Five Indian Tennis Players Were Left Out Sports Ministry Sources Explain

క్రీడా మంత్రిత్వ శాఖ ఎంపిక నిబంధనల ప్రకారం... సింగిల్స్ విభాగంలో ఆసియా స్థాయిలో టాప్-6 ర్యాంకుల్లో, డబుల్స్ విభాగంలో టాప్-8 ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లకే అవకాశం ఉంటుంది. ఆసియాలో 6వ ఉత్తమ మహిళా సింగిల్స్ క్రీడాకారిణి ర్యాంక్ 72 కాగా.. భారత నంబర్ వన్ సహజ యమలపల్లి ర్యాంక్ 344గా ఉంది. వైష్ణవి (390), వైదేహి (437) ర్యాంకులు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి.

పురుషుల విభాగంలో మానస్ ధామ్నే ర్యాంక్ 372 కాగా.. ఆసియాలో 16వ ర్యాంకర్ కూడా 227 వద్ద ఉన్నారు. ప్రార్థన (267), వైదేహి (426) గతంలో కలసి ఆడిన అనుభవం లేకపోవడం, వారి ర్యాంకులు ఆసియా స్థాయి ప్రమాణాలకు సరిపోకపోవడంతోనే వారిని తప్పించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఒక్క క్రీడకు మినహాయింపు ఇస్తే..

ఈ ఒక్క టెన్నిస్‌కు మినహాయింపు ఇస్తే మిగిలిన 40కి పైగా క్రీడల్లో కూడా ఇలాంటి మినహాయింపులు కోరతారని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా 2026-27 సంవత్సరానికి టెన్నిస్ శిక్షణ, విదేశీ పర్యటనలు, జూనియర్ డెవలప్‌మెంట్ కోసం రూ.10.05 కోట్లు కేటాయించామని, యువ ఆటగాళ్లకు భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది.

నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)

Also Read

నువ్వు కెప్టెన్ రా అయ్యా.. భయపడకు! సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్!(వీడియో)

ఏఐటీఏ అభ్యంతరం..

అయితే ఈ నిర్ణయాన్ని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ)తో పాటు భారత మాజీ టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తప్పుబట్టారు. మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వకుండానే పతకం సాధించే అర్హత లేదని అంచనా వేయడం సరికాదని బోపన్న అభిప్రాయపడ్డారు. టెన్నిస్‌లో 5 విభిన్న విభాగాల్లో పతకాల అవకాశాలు ఉంటాయని, అనుభవజ్ఞులైన ప్రార్థన వంటి వారికి అవకాశం ఇవ్వాల్సిందని ఏఐటీఏ అభిప్రాయపడింది.

ఈ వివాదం కేవలం ఐదుగురు ఆటగాళ్ల ఎంపికకు సంబంధించినది మాత్రమే కాకుండా.. ఆసియా క్రీడలు ఆటగాళ్ల ప్రతిభకు మంచి అవకాశమా లేక పతకాలు ఖాయం చేసుకునే వేదికనా అనే చర్చకు దారితీసింది.

Story first published: Tuesday, August 25, 2026, 21:53 [IST]
Other articles published on Aug 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+