For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Asian Games 2023 Schedule: నేటి భారత షెడ్యూల్ ఇదే..!

హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. నాలుగో రోజు అయిన బుధవారం పోటీల్లో భారత్ బంగారు పతకంతో శుభారంభం చేసింది. మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టోల్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత త్రయం అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది.

అంతకముందు మహిళల 50 మీటర్ల రైఫిల్ విభాగం‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. ఈ మెడల్స్‌తో భారత్ పతకాల సంఖ్య 16కు చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Asian Games 2023 September 27 schedule: India event timings

సెప్టెంబర్ 27, బుధవారం (Asian Games 2023 Schedule)

ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్, సెమీఫైనల్స్ (ఉదయం 5:30)

ఫెన్సింగ్ (ప్రిలిమినరీ నుంచి ఫైనల్): పురుషుల ఫాయిల్ టీమ్ - దేవ్, అర్జున్, ఆకాష్ కుమార్, బిబిష్ కతిరేసన్ (ఉదయం 6:30); మహిళల ఎపీ టీమ్ - తానిక్ష ఖత్రి, ఎనా అరోరా, యష్కీరత్ కౌర్, జ్యోతిక దత్తా (ఉదయం 9:30)

షూటింగ్: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3వ-స్థానం (వ్యక్తిగత, జట్టు విభాగం పోటీలు) - సిఫ్ట్ కౌర్ సమ్రా, ఆషి చౌక్సే, మణిని కౌశిక్

మహిళల 25 మీటర్ల పిస్టల్ (వ్యక్తిగత, జట్టు విభాగం పోటీలు) - రిథమ్ సాంగ్వాన్, మను భాకర్, ఈషా సింగ్; పురుషులు మరియు మహిళల స్కీట్ (వ్యక్తిగత, జట్టు విభాగం పోటీలు) - అనంతజీత్ సింగ్ నరుకా, గుర్జోత్ సింగ్ ఖంగురా మరియు గనేమత్ సెఖోన్, పరీనాజ్ ధాలివాల్, దర్శన రాథోడ్ (ఉదయం 6:30)

సైక్లింగ్ (పురుషుల స్ప్రింట్, ప్రిలిమినరీ రౌండ్): రొనాల్డో సింగ్, రోజిత్ సింగ్, డేవిడ్ బెక్హాం, ఎసోవ్ అల్బన్ (ఉదయం 7:30)

స్క్వాష్ (రౌండ్ 1): మహిళల జట్టు - జోష్నా చినప్ప, దీపికా పల్లికల్ కార్తీక్, అనాహత్ సింగ్, తన్వీ ఖన్నా (ఉదయం 7:30);
పురుషుల జట్టు - సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మంగోంకర్, హరీందర్‌పాల్ సింగ్ సంధు (ఉదయం 10 గంటలకు)

స్విమ్మింగ్ (రౌండ్ 1 నుంచి ఫైనల్): మన పటేల్, లినీషా ఏకే (ఉదయం 7:30)

టేబుల్ టెన్నిస్ (రౌండ్ 1,2): అయ్హికా ముఖర్జీ/సుతీర్థ ముఖర్జీ, దియా చితాలే/శ్రీజ ఆకుల, మానవ్ ఠక్కర్/మనుష్ షా, శరత్ కమల్/సత్యన్ జ్ఞానశేఖరన్, మానికా బాత్రా/ సత్యన్ జ్ఞానశేఖరన్, మానికా బాత్రా, శ్రీజ ఆకుల, శరత్ కమలన్, శరత్ కమల్, (ఉదయం 7:30)

టెన్నిస్: సింగిల్స్, డబుల్స్ పోటీలు (ఉదయం 7:30)

సెయిలింగ్: ఫైనల్స్ (ఉదయం 9)

మహిళల హాకీ: భారత్ vs సింగపూర్ (ఉదయం 10)

మహిళల బాస్కెట్‌బాల్: భారత్ Vs చైనా (ఉదయం 11:30)

బాక్సింగ్ (రౌండ్ 2): శివ థాపా, సంజీత్ (ఉదయం 11:30/సాయంత్రం 4:30)

జిమ్నాస్టిక్స్ (ఫైనల్): ప్రణతి నాయక్ (మధ్యాహ్నం 12:30)

మహిళల హ్యాండ్‌బాల్: ఇండియా Vs హాంకాంగ్ (సాయంత్రం 4:30)

ఉషు (సెమీఫైనల్స్): ఒనిలు తేగా, రోషిబినా దేవి, విక్రాంత్ బలియన్, సూర్య సింగ్, సునీల్ సింగ్ (సాయంత్రం 5గం)

పురుషుల బాస్కెట్‌బాల్: ఇండియా Vs మకావు (సాయంత్రం 5:30)

ఈస్పోర్ట్స్: ఈఏ స్పోర్ట్స్ ఎఫ్‌సీ ఆన్‌లైన్ ఫైనల్ (సాయంత్రం 6 గంటలకు)

Story first published: Wednesday, September 27, 2023, 10:52 [IST]
Other articles published on Sep 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+